BigTV English

Team India Practice In America: అమెరికాలో టీమ్ ఇండియా ప్రాక్టీసు షురూ..

Team India Practice In America: అమెరికాలో టీమ్ ఇండియా ప్రాక్టీసు షురూ..

Team India Begin Practice in New York Ahead of T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ నకు సర్వం సిద్ధమైంది. టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ అమెరికా చేరుకున్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిన రెండు జట్ల సభ్యులు మినహా మిగిలిన వారందరూ కోచ్ లు, సిబ్బంది అందరూ ముందుగానే అమెరికా చేరుకున్నారు. దీంతో వచ్చినవారందరూ ప్రాక్టీసు షురూ చేశారు. ఇక్కడ శీతల వాతావరణానికి అలవాటు పడే క్రమంలో ఆటగాళ్లందరూ మైదానంలో పరుగులు  తీస్తున్నారు.


టీమ్ ఇండియా ఆడే నాలుగు ప్రిలిమనరీ మ్యాచ్ ల్లో మూడు న్యూయార్క్ లోనే జరగనున్నాయి. మన ఇండియా సమయం ప్రకారం ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ లు మొదలు కానున్నాయి. అయితే అమెరికాలో ఉదయం నుంచి లేత ఎండ నుంచి చిరు ఎండ.. మధ్యాహ్నం సాధారణ స్థాయిలో ఎండ ఉంటుంది. అంటే 25 నుంచి 27 డిగ్రీల వాతావరణం నడుస్తుంటుంది.

మన ఇండియాలో తీవ్ర ఉక్కపోత, 40 డిగ్రీలపైనే ఎండలో మండే వాతావరణం ఇక్కడంతగా కనిపించదు. అందుకనే ఎక్కువసేపు ఎండలో తిరగకుండా 45 నిమిషాలు మాత్రమే ప్రాక్టీసు సెషన్ కొనసాగిందని స్ట్రెంత్, కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ తెలిపాడు. ఎందుకంటే ఇండియా నుంచి సరాసరి వచ్చి ఇక్కడ తీవ్రంగా కసరత్తులు చేస్తే, తలతిరిగి కిందపడిపోతారని అన్నాడు.


Also Read: ఇండో-పాక్ మ్యాచ్‌కు బెదిరింపులు, న్యూయార్క్ పోలీసులు..

ఇక్కడ గాలి, తేమ వాతావరణం మన భారతీయుల శరీరానికి అలవాటు కావడానికి రెండు, మూడురోజుల సమయం పడుతుందని అన్నాడు. అప్పుడు బాడీలోని రెసిస్టెన్స్ పవర్ ఈ వాతావరణానికి తనకు తానుగా అడ్జస్ట్ చేసుకుంటుందని తెలిపాడు. ఇంక రేపటి నుంచి రెగ్యులర్ ప్రాక్టీసు ఉంటుందని తెలిపాడు.

ఇక న్యూయార్క్ లో మ్యాచ్ ఆడేందుకు మన ఆటగాళ్లందరూ ఆసక్తిగా ఉన్నారు. గతంలో ఒకసారి ఇండియా-వెస్టిండిస్ సిరీస్ ఇక్కడ అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. జూన్ 5న ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ ద్వారా టీ 20 ప్రపంచకప్ సమరాన్ని టీమ్ ఇండియా ప్రారంభించ నుంది. దీనికోసం యావద్భారత దేశం, అక్కడ అమెరికాలోని ప్రవాసభారతీయులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×