IND VS USA: ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) హడావిడి మొదలైంది. ఇప్పటికే ఇవాళ రెండు మ్యాచ్ లు పూర్తికాగా ఇప్పుడు మూడవ మ్యాచ్ కూడా జరగనుంది. ఇండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( India vs United States of America) జట్ల మధ్య ఈ మూడవ మ్యాచ్ షెడ్యూల్ అయింది. అయితే ఇందులో టాస్ గెలిచిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగనుంది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Men’s T20 World Cup 2026) భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖాడే స్టేడియం ( Wankhede Stadium, Mumbai) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సూర్య ( Suryakumar Yadav ) కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగనుంది. అటు మొనక్ పటేల్ అమెరికా జట్టుకు కెప్టెన్ గా ఉంటాడు. ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మ్యాచ్ లన్ని కూడా జియో హాట్ స్టార్ వేదికగా చూడవచ్చు. అలాగే, స్టార్ స్పోర్ట్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతాయి. యూఎస్ ఏ తో జరుగుతున్న మ్యాచ్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఇరగదీస్తారని అంటున్నారు. దీంతో 300 పరుగులు లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా డేంజర్ బౌలర్ బుమ్రాకు వైరల్ ఫీవర్ సోకినట్టు తెలుస్తోంది. ఈ వైరల్ ఫీవర్ కారణంగా బుమ్రాను పక్కకు పెట్టినట్లు వెల్లడించారు సూర్య కుమార్ యాదవ్. ఇక బుమ్రా స్థానంలో సిరాజ్ జట్టులోకి వచ్చేశాడు. అలాగే ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గా ఉన్నాడు కాబట్టి సంజు శాంసన్ ను పక్కకు పెట్టారు. న్యూజిలాండ్ సిరీస్ లో కూడా సంజు శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో సంజు శాంసన్ ను తుది జట్టు నుంచి తప్పించారు.
టీమిండియా (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(w), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (ప్లేయింగ్ XI): ఆండ్రీస్ గౌస్(w), సాయితేజ ముక్కమల్ల, మోనాంక్ పటేల్(c), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్
USA have won the toss and have invited India to bat first at the Wankhede.
🚨 Jasprit Bumrah was unavailable for selection for India’s opening T20 World Cup fixture against the USA due to illness.
.
.
.
.#Cricket #Siraj #TeamIndia #Suryakumaryadav #T20WorldCup pic.twitter.com/wNR1DLeoHe— OneCricket (@OneCricketApp) February 7, 2026