E-Paper
Advertisement

CIBIL Score: నెల రోజుల్లో సిబిల్ స్కోర్ ఇలా సింపుల్ గా పెంచేయండి, లోన్ త్వరగా వచ్చేస్తుంది

CIBIL Score: నెల రోజుల్లో సిబిల్ స్కోర్ ఇలా సింపుల్ గా పెంచేయండి, లోన్ త్వరగా వచ్చేస్తుంది
Advertisement

బ్యాంకు లోన్, క్రెడిట్ కార్డ్, హౌసింగ్ లోన్ ఇలా ఏ అప్పు బ్యాంకు నుంచి తీసుకోవాలన్నా కూడా CIBIL స్కోర్ చాలా ముఖ్యం. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే బ్యాంకులు సులభంగా రుణాలు మంజూరు చేస్తాయి. కానీ చాలా మందికి స్కోర్ తక్కువగా ఉండడం వల్ల లోన్ రాదు. ఆర్థిక నిపుణుల చెబుతున్న ప్రకారం సరైన పద్దతులు పాటిస్తే కేవలం 30 రోజుల్లోనే CIBIL స్కోర్‌లో మంచి పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా ఈఎమ్ఐ లను సమయానికి చెల్లించడం, క్రెడిట్ వినియోగాన్ని తగ్గించడం వంటి చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి.

ఇలా చేయండి
మొదటగా మీ క్రెడిట్ రిపోర్ట్‌ను ఒకసారి పూర్తిగా చెక్ చేయడం చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థల పొరపాట్ల వల్ల కూడా స్కోర్ తగ్గిపోవచ్చు. తప్పులు కనిపిస్తే వెంటనే సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేసి సరిచేయించుకోవాలి. అలాగే క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఈఎంఐలు ఎప్పుడూ గడువు తేదీకి ముందే చెల్లించడం చాలా ముఖ్యం. ఒక్కసారి ఆలస్యం జరిగినా అది రిపోర్ట్‌లో నమోదు అవుతుంది. ఆ ప్రభావం సిబిల్ స్కోర్‌పై పడుతుంది.

Advertisement

Also read: Spinach Fry: పాలకూర నువ్వుల వేపుడు రెసిపీ, తింటే ఎంతో ఆరోగ్యం పైగా రుచికి రుచి

క్రెడిట్ కార్డు ఎలా వాడాలి?
క్రెడిట్ కార్డు వినియోగం కూడా సిబిల్ స్కోరుపై ప్రభావం పడుతుంది. మీకు క్రెడిట్ కార్డు ఇచ్చిన నగదు లిమిట్‌లో 30 నుంచి 40 శాతం మాత్రమే ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు మీ కార్డ్ లిమిట్ రూ.1 లక్ష అయితే రూ.30,000 నుంచి రూ.40,000 మధ్యలోనే వినియోగిస్తే స్కోర్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగే ఒకేసారి ఎక్కువ లోన్లకు అప్లై చేయడం కూడా మంచిది కాదు. ప్రతి అప్లికేషన్ మీ క్రెడిట్ రిపోర్ట్‌లో నమోదవుతుంది. ఇది సిబిల్ స్కోర్‌ను తాత్కాలికంగా తగ్గిస్తుంది.

Advertisement

Also read: Train: రైలు చివరి బోగీపై X గుర్తు ఎందుకు ఉంటుంది? దీని వెనుక అర్థమేంటి?

మొత్తానికి CIBIL స్కోర్ పెంచుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. సరైన ఆర్థిక క్రమశిక్షణ, సమయానికి చెల్లింపులు, తక్కువ క్రెడిట్ వినియోగం, తప్పులేని క్రెడిట్ రిపోర్ట్ వంటి విషయాలు పాటిస్తే 30 రోజుల్లోనే కొంత మార్పు కనిపిస్తుంది. మంచి స్కోర్ ఉండటం వల్ల తక్కువ వడ్డీతో లోన్లు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చులపై నియంత్రణ, ఆర్థిక ప్రణాళికపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్తులో త్వరగా అవసరం అయినప్పుడు బ్యాంకుల నుంచి లోన్ పొందవచ్చు.

Related News

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

బంగారం సరే.. డబ్బులు ఎలా డబుల్ అవుతాయ్? ఇలా చేస్తే సరి!

భయపెడుతోన్న రూపాయి.. బలపడుతోన్న డాలర్, RBI కళ్లెం వేయగలదా?

పోస్ట్ ఆఫీస్ RDలో నెలకు రూ.6,000 పొదుపు చేస్తే.. 5 ఏళ్లకు ఎంత వస్తుంది?

పండుగ సేల్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సీక్రెట్ ఇదే

19 ఏళ్ల యువకుడి అద్భుత సృష్టి.. 3D ప్రింటింగ్ ఐడియాతో.. రూ.7 కోట్లకు పైగా సంపాదన!

అత్తమామల ఇల్లు, ఆస్తిపై కోడలికి హక్కులుంటాయా? భారత చట్టం ఏం చెబుతోందంటే

Big Stories

Advertisement
×