INDW vs SLW 2nd T20I: టీమిండియా వర్సెస్ శ్రీలంక మహిళల ( India Women vs Sri Lanka Women ) జట్ల మధ్య టీ20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా మహిళల జట్టు, రెండో మ్యాచ్ లో కూడా విజయం సాధించింది. లేడీ వీరేంద్ర సెహ్వాగ్ షెఫాలీ వర్మ ( Shafali Verma ) 69 పరుగులతో రెచ్చిపోయింది. దీంతో శ్రీలంక మహిళల జట్టుపై ఏకంగా ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 128 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని 11.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది టీమిండియా మహిళల జట్టు. దీంతో రెండో టీ20 లో కూడా విజయం సాధించింది టీం ఇండియా ( India Women).
టీమిండియా వర్సెస్ శ్రీలంక మహిళల జట్ల ( India Women vs Sri Lanka Women, 2nd T20I ) మధ్య ఇవాళ విశాఖపట్నం వేదికగా రెండవ టి20 జరిగింది. ఈ మ్యాచ్ విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా (ACA-VDCA Cricket Stadium, Visakhapatnam ) జరగగా మొదట శ్రీలంక బ్యాటింగ్ చేసింది. మొదట శ్రీలంక బ్యాటింగ్ చేసి మరోసారి అట్టర్ ఫ్లాఫ్ అయింది. టీమిండియా బౌలర్లు అదరగొట్టడంతో నిరత 20 ఓవర్లలో 128 పరుగులు సాధించిన శ్రీలంక తొమ్మిది వికెట్లు నష్టపోయింది.
ఇక 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆచితూచి ఆడింది. కేవలం 11.5 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా లక్ష్యాన్ని చేదించింది. లేడీ వీరేంద్ర సెహ్వాగ్ గా పేరు పొందిన షెఫాలీ వర్మ 34 బంతుల్లో 69 పరుగులు సాధించారు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు 11 బౌండరీలు సాధించారు వర్మ. ఆమెతోపాటు జెమిమా కూడా అదరగొట్టారు. ఒక సిక్సర్ అలాగే నాలుగు బౌండరీలు సాధించి రెచ్చిపోయారు. ఇక మొన్న పెళ్లి రద్దు చేసుకున్న స్మృతి మందాన మరోసారి విఫలమయ్యారు. 11 బంతుల్లో 14 పరుగులు సాధించిన స్మృతి మందాన.. మ్యాచ్ గెలిపించలేకపోయారు.
టీమిండియా వర్సెస్ శ్రీలంక మహిళల ( India Women vs Sri Lanka Women ) జట్ల మధ్య ఈ మరో 3 టీ 20లు జరుగనున్నాయి. డిసెంబర్ 26వ తేదీన టీమిండియా వర్సెస్ శ్రీలంక మహిళల మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరుగనుంది. అలాగే, డిసెంబర్ 28వ తేదీన 4వ టీ20వ మ్యాచ్ జరుగనుంది. డిసెంబర్ 30వ తేదీన 5వ టీ20వ మ్యాచ్ నిర్వహించనున్నారు. ( INDW vs SLW 2nd T20I )
12th fifty for Shafali Verma in T20Is! 👌
She has made the chase look easy for India in the second T20I against Sri Lanka. ⭐#Cricket #India #INDvSL pic.twitter.com/sYjfqHBejw
— Sportskeeda (@Sportskeeda) December 23, 2025