E-Paper
Advertisement

Sourav Ganguly: 85 శాతం కంటి చూపు కోల్పోయిన పాకిస్తాన్ క్రికెట‌ర్‌..రంగంలోకి టీమిండియా ప్లేయ‌ర్లు, 14 మంది సంచ‌ల‌న లేఖ‌

Sourav Ganguly: 85 శాతం కంటి చూపు కోల్పోయిన పాకిస్తాన్ క్రికెట‌ర్‌..రంగంలోకి టీమిండియా ప్లేయ‌ర్లు, 14 మంది సంచ‌ల‌న లేఖ‌
Advertisement

Sourav Ganguly: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan ) ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోంది. ప్రస్తుతం రావాల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతని కుడి కన్ను దాదాపు 85% దెబ్బతిందట. ఇప్పటికిప్పుడు సరైన వైద్య సదుపాయం అందించకపోతే, పూర్తిగా ఆయన కంటిచూపు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందట. ఇలాంటి నేపథ్యంలో ఇండియాకు చెందిన మాజీ క్రికెటర్లు ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan ) ఆరోగ్యం పై స్పందిస్తున్నారు. తమ శత్రుదేశం అయినప్పటికీ, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని టీమిండియా మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందులో సౌరవ్ గంగూలీ కూడా ఉన్నారు.

Also Read: IND VS PAK: ఇక‌ పాకిస్తాన్ కు సిగ్గు రాదు..గెల‌వ‌డం చేత‌కాక‌, చివ‌ర‌కు హిట్ వికెట్ చేసేందుకు కుట్ర‌

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పై సౌరవ్ గంగూలీ సీరియస్

Advertisement

కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పై బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ) స్పందించారు. ప్రపంచ ప‌ఠంలో పాకిస్తాన్ ఉండడానికి కారణం ఇమ్రాన్ ఖాన్ అని.. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టడం దారుణం అంటూ ఫైర్ అయ్యారు సౌర‌వ్ గంగూలీ. వెంటనే ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని తాజాగా కోరారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కూడా ఇమ్రాన్ ఖాన్ అందించిన సేవలు అంతా ఇంతా కాదని వెల్లడించారు. అన్ని రంగాల్లో పాకిస్తాన్ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అని కొనియాడారు. అలాంటి వ్యక్తి జైల్లో అనారోగ్యం బారిన పడితే పట్టించుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్ సర్కారుపై ఉందని నిప్పులు చెరిగారు సౌర‌వ్ గంగూలీ. ఇమ్రాన్ ఖాన్ కు వెంటనే ట్రీట్మెంట్ అందించాలని కోరారు.

ఇమ్రాన్ ఖాన్ కోసం కపిల్, గవాస్కర్ తోపాటు 14 మంది మాజీ క్రికెటర్ల లేఖ

పాకిస్తాన్ లోని రావాల్పిండి జైలులో చిప్పకూడు తింటున్న మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంపై టీమిండియా మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. 85 శాతం కంటి చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ కు అన్ని సౌకర్యాలు కల్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి 14 మంది టీమిండియా మాజీ క్రికెటర్లు లేఖ రాశారు. ఇందులో భారత లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ అలాగే సౌరవ్ గంగూలీ లాంటి ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్రమక్రమంగా చినిస్తోంది. ఇది ఇలా ఉండగా 1992లో వరల్డ్ కప్ పాకిస్తాన్ కు అందించింది ఇమ్రాన్ ఖాన్ కావడం గమనార్హం. 2018 నుంచి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానిగా కూడా ఆయన కొనసాగారు.

Advertisement

Also Read: IND vs PAK cricketers car collection: టీమిండియా, పాక్ క్రికెట‌ర్ల కార్ల క‌లెక్ష‌న్‌, వర్త్ వర్మ వర్త్.. క‌ళ్లు చెదిరిపోవాల్సిందే

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×