Boxer Neeraj Goyat: ఆటలు చాలా స్ఫూర్తిదాయంగా ఉండాలి. అప్పుడే క్రీడాకారుల మధ్య స్నేహ పూర్వక వాతావరణం పెంపొందుతూ ఉంటుంది. అదే సమయంలో రెండు దేశాల మధ్య బంధాలు పెరుగుతాయి. కానీ, కొంతమంది క్రీడాకారులు మాత్రం అనవసరంగా ఓడిపోయాం అన్న అవమానంతో రెచ్చిపోతూ ఉంటారు. స్లెడ్జింగ్ చేయడం లేదా ప్రత్యర్థి ప్లేయర్ పై దాడి చేయడం లాంటివి జరుగుతాయి. అలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా చోటు చేసుకున్నాయి. తాజాగా బాక్సింగ్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఓడిపోయాడన్న అవమానంతో మన ఇండియన్ ప్లేయర్ పైన దారుణంగా దాడి చేశాడు అమెరికన్ బాక్సర్. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
దుబాయిలో మిస్ ఫిట్స్ బాక్సింగ్ 23 ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో ఇండియాకు చెందిన బాక్సర్ నీరజ్ గోయత్ ( Indian Boxer Neeraj Goyat ) పైన అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డాడు అమెరికాకు చెందిన బాక్సర్ ఆంథోనీ టైలర్. వాస్తవంగా ఈ బాక్సింగ్ ఈవెంట్ లో అమెరికన్ బాక్సర్ ఆంథోనీ టైలర్ పై మన ఇండియా కు చెందిన నీరజ్ గోయత్ విజయం సాధించాడు. అయితే విజయం సాధించిన తర్వాత తన రూమ్ లోకి వెళ్లిపోయాడు ఇండియన్ బాక్సర్ నీరజ్ గోయత్. ఇక ఈ తరుణంలోనే, ఓటమిని తట్టుకోలేని, ఆంథోనీ టైలర్ రెచ్చిపోయాడు.
నీరజ ఉన్న రూమ్ లోకి వెళ్లి మరి దాడి చేశాడు. మొదట నీరజ్ గోయత్ తో స్నేహపూర్వకంగా మాట్లాడిన ఆంథోనీ టైలర్, అనంతరం దాడి చేశాడు. వాటర్ బాటిల్ తో ముఖం పైన కొట్టేశాడు అమెరికన్ బాక్సర్ ఆంథోనీ టైలర్ ( Anthony Taylor ). అయితే వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయింది. అమెరికాకు చెందిన ఆంథోనీని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. అయితే తనపై దాడి చేయడంతో బాక్సర్ నీరజ్ గోయత్ కూడా చాలా సీరియస్ అయ్యాడు. అతనికి గట్టిగా బదులిచ్చే ప్రయత్నం చేశాడు భారత బాక్సర్ నీరజ్ గోయత్.
కానీ సెక్యూరిటీ ఆపడంతో ఒక మెట్టు దిగాడు నీరజ్ గోయత్. అయితే ఈ సంఘటన ఎప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ సంఘటన వైరల్ కావడంతో క్రీడా విశ్లేషకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓటమిని ధైర్యంగా స్వీకరించాలని, ఇలా గెలిచిన వాళ్ళ పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఫైర్ అవుతున్నారు. ఇలా కొట్టుకుంటూ పోతే , ఎంతమందిని కొడతారని నిలదీస్తున్నారు. క్రీడా రంగంలో ఇది ఒక బ్లాక్ డే అంటూ వర్ణిస్తున్నారు. వెంటనే ఇండియన్ బాక్సర్ కు అమెరికన్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
SHOCKING BEHAVIOR BY ANTHONY 😱
Unable to accept his defeat, Boxer Anthony Taylor confronted & attacked Indian boxer Neeraj Goyat backstage 😳
Neeraj Goyat has defeated Anthony Taylor 🇺🇸 by unanimous decision (3–0) at Misfits Mania
Warning ⚠️ : Language pic.twitter.com/bymMoPO3Eh
— News Algebra (@NewsAlgebraIND) December 21, 2025