E-Paper
Advertisement

Best Selling Scooters Of 2025: అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్కూటర్లు ఇవే, నెంబర్ వన్ ఏదంటే?

Best Selling Scooters Of 2025: అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్కూటర్లు ఇవే, నెంబర్ వన్ ఏదంటే?
Advertisement

దేశీ మార్కెట్లో స్కూటర్ల అమ్మకాలు కూడా ఈ ఏడాది బాగా పెరిగాయి. జనవరి నుంచి నవంబర్ వరకు అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. SIAM డేటా ప్రకారం ఫ్యామిలీ స్కూటర్లు (110-125cc పెట్రోల్) మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. మైలేజ్, రిలయబిలిటీ, ప్రాక్టికాలిటీ కారణంగా మంచి అమ్మకాలు కొనసాగిస్తున్నాయి.

2025లో టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు

 

⦿ Honda Activa Range (Activa 110 & Activa 125)

Advertisement

ఈ స్కూటర్లు 2025లో ఏకంగా 24.08 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి. గత ఏడాదితో పోల్చితే +0.36% గ్రోత్ కనబరిచింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. మంచి మైలేజ్ (50-60 kmpl), మంచి సర్వీస్ నెట్వర్క్. ఫ్యామిలీ రైడింగ్ కు అనుకూలంగా ఉండటంతో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.

⦿ TVS Jupiter Range (Jupiter 110 & Jupiter 125)

ఈ ఏడాది అత్యధిక అమ్మకాలు జరపుకున్న స్కూటర్ గా ఇది రెండో స్థానంలో నిలిచింది. జనవరి నుంచి నవంబర్ వరకు 12.79 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోల్చితే 38.84%  గ్రోత్ రేట్ కనబరిచింది. అద్భుతమైన ఫీచర్లు, డిజిటల్ కన్సోల్, LED లైట్స్, మంచి కంఫర్ట్, మైలేజ్ (55+ kmpl) కారణంగా కొనుగోళ్లు పెరిగాయి.

⦿ Suzuki Access 125

Advertisement

సుజుకి కంపెనీకి చెందిన ఈ స్కూటర్ అమ్మకాల్లో మంచి ప్రగతి కనబరించింది. ఈ ఏడాది 7.11 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి. గత ఏడాదితో పోల్చితే 6.74% గ్రోత్ రేట్ సాధించింది. పెప్పీ 125cc ఇంజన్, మంచి బిల్డ్ క్వాలిటీ, ప్రాక్టికాలిటీ, పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ కారణంగా మంచి ఆదరణ దక్కించుకుంది.

Read Also: 60 ఏళ్ల కిందట అంబాసిడర్ కారు ధర ఇంతేనా? ఆ రేటుతో ఇప్పుడు టైరు కూడా రాదు!

⦿ Hero Destini 125 / Pleasure Plus

ఈ స్కూటర్ కూడా అమ్మకాల్లో దూకుడు కొనసగించింది.  ఈ ఏడాది సుమారు 6 లక్షల వరకు అమ్మకాలు జరుపుకుంది. సరసమైన ధర, మంచి మైలేజ్, వుమెన్ ఫ్రెండ్లీ డిజైన్ (Pleasure Plus) కారణంగా ఎక్కువ సేల్స్ అందుకుంది.

⦿ Suzuki Burgman Street Range

ఈ స్కూటర్ కూడా మంచి అమ్మకాలు కనబరిచింది. మిడియం రేంజ్, మ్యాక్సీ-స్టైల్ స్కూటర్లు బాగా అమ్ముడయ్యాయి. ప్రీమియం ఫీల్, స్పేషియస్, కంఫర్టబుల్ రైడ్ కారణంగా ఎక్కువగా సేల్స్ అందుకున్నాయి.

Read Also: ఈ ఏడాది అమ్మకాల్లో దూసుకెళ్లిన టాప్ 5 బైక్స్ ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

2025లో పెట్రోల్ స్కూటర్లు మార్కెట్ ను డామినేట్ చేస్తున్నాయి. కానీ, ఎలక్ట్రిక్ స్కూటర్లు Ola S1, TVS iQube  రాపిడ్ గ్రోత్ చూపిస్తున్నాయి. డిసెంబర్ డేటా ఇంకా రాలేదు. కొత్త డేటా వచ్చినా ట్రెండ్ మారే అవకాశం లేదు. మొత్తంగా ఈ ఏడాది హోండా యాక్టివా క్వీన్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: మోస్ట్ పాపులర్ ఇండియన్ మేడ్ వింటేజ్ కార్లు, ఒక్కోదాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×