BigTV English

Indian Cricketers: టీమిండియా ప్లేయర్ అరాచకం.. ఒక్క దేశానికి ఒక్క అమ్మాయిని..!

Indian Cricketers: టీమిండియా ప్లేయర్ అరాచకం.. ఒక్క దేశానికి ఒక్క అమ్మాయిని..!

Indian Cricketers: టీమిండియా సీనియర్ స్టార్ బ్యాటర్ శేఖర్ ధావన్.. ఆయన భార్య ఆయేషా ముఖర్జీతో 2023లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ధావన్ క్రికెట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే శిఖర్ ధావన్ ని ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ఐసీసీ నుండి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అప్పటినుండి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు శిఖర్ ధావన్. ఏ సందర్భంలోనైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ స్టార్ ప్లేయర్.. విడాకుల తర్వాత కాస్త మౌనంగా ఉంటున్నాడు.


Also Read: Mohammad Shami: టీమిండియా బౌలర్లు దేనికి పనికిరారు.. నన్ను తీసుకున్నా.. గెలిచేవాళ్లం

అయితే ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ధావన్ మళ్ళీ ప్రేమలో పడ్డట్లు వార్తలు వచ్చాయి. ఒకానొక సందర్భంలో ఓ ఈవెంట్ లో తాను ప్రేమలో ఉన్నానని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. గత కొంతకాలంగా సోఫి షైన్ అనే విదేశీ అమ్మాయితో ధావన్ చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న సంగతి తెలిసిందే. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయిలో జరిగిన సందర్భంలో.. ధావన్ ఆ అమ్మాయితో తిరుగుతూ కనిపించాడు. ముఖ్యంగా దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ విమానం దిగి బయటికి వస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి.


ఇక వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం కూడా సాగింది. ఆ తర్వాత ఆ అమ్మాయితో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. వారి రిలేషన్షిప్ ని కన్ఫార్మ్ చేశాడు. అయితే శిఖర్ ధావన్ 2006లో చేసిన ఓ ఆకతాయి పనిని తాజాగా బయటపెట్టాడు. నిజానికి ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయడమే జీవితం అంటాడు ధావన్. అలాంటి ధావన్ 2006లో యువతితో రిలేషన్ లో ఉన్నాడు. భారత – ఏ జట్టు తరపున ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లిన జట్టులో శిఖర్ ధావన్ తో పాటు రోహిత్ శర్మ కూడా సభ్యులు.

ఆ సమయంలో భారత – ఏ జట్టు ప్లేయర్లకు షేరింగ్ లో హోటల్ రూమ్స్ కేటాయించారు. అప్పుడు రోహిత్ శర్మ – ధావన్ ఒకే రూమ్ లో ఉన్నారు. అప్పుడు జరిగిన ఓ సంఘటనని తాజాగా పంచుకున్నాడు శిఖర్ ధావన్. ” ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది. అందుకే ఆమెని చూడగానే ప్రేమలో పడిపోయాను. ఆ అమ్మాయి నాకోసమే పుట్టినట్టు అనిపించేది. ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ప్రాక్టీస్ మ్యాచ్ లో నేను హఫ్ సెంచరీ చేశాను.

నా ఆట బాగా నడుస్తుంది. అయితే ప్రాక్టీస్ ముగిసిన తర్వాత వెళ్లి ఆమెను కలుస్తూ ఉండేవాడిని. ఆ తరువాత నా హోటల్ రూమ్ కి ఆ అమ్మాయిని రహస్యంగా తీసుకురావడం మొదలుపెట్టాను. అప్పుడు రోహిత్ శర్మ, నేను ఒకే రూమ్ లో ఉండే వాళ్ళం. ఇంగ్లీష్ లో మాట్లాడితే ఆమెకు అర్థం అవుతుందని.. నన్ను పడుకోనిస్తావా..? అని హిందీలో అడిగేవాడు. ఓ రోజు సాయంత్రం నేను ఆ అమ్మాయి తీసుకొని డిన్నర్ కి వెళ్ళాను. దీంతో నేను ఓ అమ్మాయితో తిరుగుతున్నానని జట్టు మొత్తానికి తెలిసిపోయింది.

నేను ఆ అమ్మాయి చేతులు పట్టుకొని నడుస్తుంటే మా జట్టు సెలెక్టర్ చూసాడు. ఆ సమయంలో నా పొజిషన్ లో ఎవ్వరు ఉన్నా.. ఆ అమ్మాయి చేతులు వదిలేసేవాళ్లేమో. కానీ నాకు మాత్రం నేను ఏం తప్పు చేయడం లేదని అనిపించింది. అందుకే ఆమె చేతులు గట్టిగా పట్టుకున్నాను. ఇక ఏ అవకాశం దొరికినా నన్ను జట్టు నుండి తీసేస్తారని నాకు అర్థం అయింది. అందుకే ఆ టూర్ లో నా పర్ఫార్మెన్స్ పడిపోకుండా చూసుకున్నాను.

Also Read: Rinku Singh: యోగి ప్రభుత్వంలో రింకూ సింగ్ కు కీలక పదవి.. ఇక క్రికెట్ కు గుడ్ బై!

ప్రతి మ్యాచ్ లో మరింత బాగా రాణించాలని డిసైడ్ అయ్యాను. కానీ నేను అనుకున్నట్లుగా ఆడలేకపోయాను. ప్రతి మ్యాచ్ కి నా పర్ఫార్మెన్స్ తగ్గుతూ పోయింది. అలా జట్టులోకి రావడానికి నాకు మళ్ళీ చాలా సమయం పట్టింది” అని తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చాడు శిఖర్ ధావన్. ఇక ఈ విషయం తెలిసిన క్రీడాభిమానులు.. ధావన్ ఇలా ఒక్కో దేశానికి ఒక్కో అమ్మాయితో వెళ్లి ఎంజాయ్ చేసి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Ind vs WI, 1st Test: రేప‌టి నుంచే విండీస్ తో తొలి టెస్ట్‌..జ‌ట్ల వివ‌రాలు.. ఉచితంగా ఎలా చూడాలంటే

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

Tilak-Dube : శివమ్ దూబేకు తిలక్ వర్మ వెన్నుపోటు…? గంభీర్ కు జరిగిన అన్యాయమే ఇప్పుడు రిపీట్

Mohsin Naqvi : సూర్య.. నా ఆఫీస్‍‌కొచ్చి కప్పు తీసుకెళ్లు… నఖ్వీ కొత్త కండీష‌న్లు

Vaibhav Suryavanshi : ఆస్ట్రేలియాపై సూర్యవంశీ సూపర్ సెంచరీ… ఏకంగా 8 సిక్సర్లు

Tilak Verma : త‌మ్ముడు తిల‌క్‌…ఆంధ్ర వాడి దెబ్బ.. పాకిస్తాన్ వాడి అబ్బా… జై జగన్ అంటూ

Saeed Ajmal Cheque : పాక్ PM ఇచ్చిన చెక్కులు బౌన్స్..ఆ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం

Ind vs SL: వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ… శ్రీలంక చిత్తు చిత్తు

Big Stories

×