Rinku Singh: టీమ్ ఇండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ కొత్త బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఉత్తర ప్రదేశ్ విద్యాశాఖ విభాగంలో రింకూ ఉద్యోగంలో చేరనున్నాడు. అతడిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జిల్లా ప్రాథమిక విద్య అధికారి {BSA} గా నియమిస్తున్నట్లు సమాచారం. తాజాగా యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి రింకూ సింగ్ ప్రభుత్వ నియామకాన్ని పొందడం జరిగింది.
Also Read: AUS Worst Record: వెస్టిండీస్ చేతిలో ఆస్ట్రేలియా చిత్తు.. 30 ఏళ్ళ ఇదే తొలిసారి..
అంతర్జాతీయ అథ్లెట్లకు ప్రభుత్వ సేవలలో పదవులు కల్పించి వారిని గౌరవించాలని ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు భావించడం విశేషం. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మోడల్ విన్నర్స్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ రూల్స్ 2022 ప్రకారం రింకూ సింగ్ ని ఈ పదవి కోసం ఎంపిక చేశారు. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. కొంతమందికి అస్సలు నచ్చడం లేదు. ఈ నియామకంతో సోషల్ మీడియాలో రింకూ సింగ్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఎందుకంటే రింకూ కేవలం 9వ తరగతి మాత్రమే పాస్ కావడంతో.. బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ {Basic Education Officer }నియామకంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో రింకు సింగ్ విజయాలను దృష్టిలో పెట్టుకొని క్రీడా కోటా కింద ఆయనని ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా నియమించారు. ఈ నియామకం ద్వారా జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించే బాధ్యత ప్రాథమిక విద్యాధికారికి ఉంటుంది.
సిబ్బందిని నిర్వహించడం, విద్యా కార్యక్రమాల పనులను సజావుగా జరిగేలా చూడడం, నాణ్యత ప్రమాణాలను నిర్వహించడానికి పాఠశాలలను తనిఖీ చేసే అధికారం ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి ఉంటుంది. ప్రత్యేక నిబంధనల కింద నియమితుడైన రింకు సింగ్ ఇప్పుడు తన క్రికెట్ కెరీర్ తో పాటు విద్యావ్యవస్థ అభివృద్ధికి కూడా తోడ్పడతారు. ఇక రింకూ 2023లో ఐర్లాండ్ జట్టుపై తన టి-20 అరంగేట్రం చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు.
Also Read: Varsha Bollamma: కోహ్లీ అంటే మోజు… RCB జట్టులోకి టాలీవుడ్ హీరోయిన్.. బ్యాట్ పట్టిమరీ
ఆ తర్వాత అదే సంవత్సరం ఇంగ్లాండ్ జట్టు పై తన చివరి టి-20 మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రింకు ఇప్పటివరకు భారత జట్టు తరుపున 33 T-20 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది నవంబర్ 18న వారణాసిలో జరగాల్సిన రింకు సింగ్ – ఎస్పి ఎంపీ ప్రియా సరోజ్ వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. నవంబర్ లో క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉన్న కారణంగా రింకూ తన పెళ్లికి వాయిదా వేసుకున్నాడు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రింకూ పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. తుది తేదిని త్వరలో ప్రకటించనున్నారు.