E-Paper
Advertisement

Kurukshetra War: కొన్ని లక్షల మంది పాల్గొన్న కురుకేత్ర యుద్దం తర్వాత మిగిలింది ఎంత మందో తెలుసా..?

Kurukshetra War: కొన్ని లక్షల మంది పాల్గొన్న కురుకేత్ర యుద్దం తర్వాత మిగిలింది ఎంత మందో తెలుసా..?
Advertisement

Kurukshetra War: యుగాలు మారినా తరాలు మారినా కురుక్షేత్ర యుద్దం గురించి మాత్రం మర్చిపోరెవ్వరు.. కొన్ని లక్షల మంది పాల్గొన్న ఆ కురుక్షేత్ర యుద్దంలో జరిగిన నష్టం ఎంతో ఎవ్వరూ అంచనా వేయలేరు.. పోయిన ప్రాణాలు ఎన్నో ఎవ్వరూ లెక్కపెట్టలేరు.. అంతటి విధ్వంసం జరిగినా కూడా చివరికి కొంత మంది బతికి బయటపడ్డారు.. యుద్ద వీరులుగా చలామణి అయ్యారు.. చరిత్రలో నిలిచిపోయారు. రాజులుగా రాజ్యాలు పాలించారు.. అయితే కురుక్షేత్ర యుద్దం ముగిసిన తర్వాత కూడా మిగిలిన వీరులెంత మంది..? ఆ వీరులెవ్వరు..? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మహాభారత యుద్ధం (కురుక్షేత్ర సంగ్రామం) 18 రోజుల పాటు జరిగింది. 18 అక్షౌహిణుల సైన్యం (సుమారు 39 లక్షల మందికి పైగా యోధులు) పాల్గొన్న ఈ మహా యుద్ధంలో చివరకు కేవలం 18 మంది ముఖ్య యోధులు మాత్రమే ప్రాణాలతో మిగిలారట. ఆ పద్దెనిమిది మంది ఎవ్వరో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కురుక్షేత్ర యుద్దంలో పాండవులు పక్షాన నిలిచిని ఎనిమిది మంది బతికారట. వారిలో పంచ పాండవులు

ధర్మరాజు: (యుధిష్ఠిరుడు): ఐదుగురు పాండవులలో పెద్దవాడు.

Advertisement

భీముడు: గదా యుద్ధ వీరుడు. పాండవులలో రెండవ వాడు.

అర్జునుడు: గాండీవధారి. నరనారాయణులలో ఒకరు. పాండవులలో మూడవ వాడు.

నకులుడు: మాద్రి కుమారుడు నకులుడు. పాండవులలో నాలుగవ వాడు.

సహదేవుడు:  త్రికాలజ్ఞాని సహదేవుడు. పాండవులలో ఐదవ వాడు.

శ్రీకృష్ణుడు: పాండవులకు మార్గనిర్దేశనం చేసిన పరమాత్ముడు. యుద్దం మాత్రమే కాదు ప్రతి నిత్యం ధర్మం కోసం ధర్మం తరపున నిలబడిన వాడు. పాండవులకు ముందు నుంచి సాయం చేసిన వాడు శ్రీకృష్ణుడు.

సాత్యకి: యాదవ వీరుడు, అర్జునుడి శిష్యుడు.

యుయుత్సుడు: ధృతరాష్ట్రుడి కుమారుడు (కౌరవుల సోదరుడు) అయితే ఇతడు ధర్మం వైపు నిలబడి పాండవుల పక్షాన యుద్ధం చేశాడు. కౌరవ సోదరులలో మిగిలిన ఏకైక వ్యక్తి ఇతనేనట.

ఇక ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, యయుత్సుడు, సాత్యకి రథం నడిపిన 7 గురు కూడా పాండవుల తరపున యుద్దంలో పాల్గొని బతికారట.

కౌరవుల పక్షాన యుద్దంలో పాల్గొని బతికి వారు ముగ్గురు. యుద్దం చివరి రోజు కౌరవ సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుపోయిన తర్వాత చివరి రాత్రి మిగిలిన వారు ఈ ముగ్గురు మాత్రమేనట వారిలో

అశ్వత్థామ: ద్రోణాచార్యుడి కుమారుడు. ఇతడు చిరంజీవి (అమరత్వం పొందినవాడు)

కృపాచార్యుడు: కౌరవ, పాండవుల కులగురువు. ఇతడు కూడా చిరంజీవి.

కృతవర్మ: యాదవ వీరుడు, కౌరవుల పక్షాన పోరాడాడు. ఇతను కూడా యుద్దంలో పాల్గొని బతికిన వాడు .

వృషకేతుడు: కర్ణుడి కుమారుడు. కొన్ని గ్రంథాల ప్రకారం కర్ణుడి కుమారులలో వృషకేతుడు ఒక్కడే యుద్ధం తర్వాత జీవించి ఉన్నాడట. తర్వాతి కాలంలో అర్జునుడు ఇతనికి యుద్ధ విద్యలు నేర్పించి, తన కొడుకులా చూసుకున్నాడట.

ఇక యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేసినప్పుడు   తర్వాతి కాలంలో మరికొంత మంది చిన్న చిన్న యోధులు పరిచారకులు మిగిలి ఉన్నట్లు ప్రస్తావనలు ఉన్నప్పటికీ పై పేర్కొన్న 18 మంది  మాత్రమే యుద్ధంలో పాల్గొన్న ప్రధాన అతిరథ మహారథులు బతికి ఉన్నట్టు చెప్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఏ తేదీలో పుట్టిన వారికి రెండు పెళ్లిళ్లు అవుతాయో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×