Inzamam-ul-Haq: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ( Pakistan Super League 2026 Tournament) ఛాంపియన్ గా పెషావర్ జల్మీ ( Peshawar Zalmi) జట్టు నిలిచింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా నిన్న లాహోర్ లోని గడాఫీ స్టేడియం ( Gaddafi Stadium, Lahore) వేదికగా హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ ( Peshawar Zalmi vs Hyderabad Kingsmen) జట్లు తలపడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన పెషావర్ జల్మీ, ఐదు వికెట్ల తేడాతో విజయం అందుకుంది. దీంతో తొమ్మిది సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డ్ సృష్టించింది బాబర్ ఆజం సేన. దీంతో పాకిస్తాన్ లో సంబరాలు చేసుకుంటున్నారు బాబర్ ఆజం అభిమానులు.
Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజేతగా పెషావర్ జల్మీ ( Peshawar Zalmi ) జట్టును బాబర్ ఆజం నిలిపిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా… జట్టును ముందుండి నడిపించి ఛాంపియన్ చేశాడు బాబర్ ఆజం. ఈ క్రమంలో బాబర్ ఆజం పైన సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ జట్టుకు మళ్లీ బాబర్ ఆజంను కెప్టెన్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ( Inzamam-ul-Haq ) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో పెషావర్ జల్మీ ఛాంపియన్ కావడం వెనక బాబర్ ఆజం కృషి ఉందని ప్రశంసించారు. అతని కారణంగానే జట్టు ఫైనల్ దాకా వెళ్లి టైటిల్ గెలిచిందన్నారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా పాకిస్తాన్ కెప్టెన్సీ పగ్గాలు బాబర్ ఆజంకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రత్యేక చర్య తీసుకొని.. బాబర్ విషయాన్ని ఆలోచన చేయాలని కోరారు. పాకిస్తాన్ జట్టుకు మళ్లీ బాబర్ ఆజం కెప్టెన్ ( Babar Azam retain captaincy) అయితే, మంచి రోజులు రావడం గ్యారెంటీ అంటూ ఇంజమామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఫైనల్ జరిగింది. ఇందులో హైదరాబాద్ కింగ్స్ మెన్ మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 18 ఓవర్లు ఆడిన హైదరాబాద్, 129 పరుగులు సాధించింది. సెయిమ్ అయూబ్ అర్థ సెంచరీ తో రాణించగా, మిగిలిన ప్లేయర్లు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. దీంతో హైదరాబాద్ 129 పరుగులు మాత్రమే సాధించింది. ఈ లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఛేదించింది పెషావర్ జల్మీ. దీంతో రెండోసారి టైటిల్ విజేతగా నిలిచింది బాబర్ సేన.
🚨 MEMORABLE MOMENTS FOR PESHAWAR ZALMI AND BABAR AZAM 🏆#PSLFinal pic.twitter.com/XdiIFZPxpl
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) May 3, 2026