Inzamam-ul-Haq On Women’s T20 World Cup 2028: పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా (Pakistan vs. Team India) మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో కేవలం ఐసీసీ టోర్నమెంట్స్ లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టి20 మహిళల ప్రపంచకప్ 2028 టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2028) పాకిస్తాన్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq On Women’s T20 World Cup 2028) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
టి20 వరల్డ్ కప్ 2028 (Women’s T20 World Cup 2028) పాకిస్తాన్ లో జరుగుతున్న నేపథ్యంలో ప్రతి జట్టు తమ దేశానికి రావాల్సిందేనన్నారు. ఇండియా కూడా పాకిస్తాన్ కు వచ్చి మ్యాచ్ లు ఆడాల్సిందేనని తేల్చి చెప్పారు. ఒకవేళ పాకిస్తాన్ లో పర్యటించబోమని టీమిండియా స్టాండ్ తీసుకుంటే…వాళ్లపై బ్యాన్ విధించాల్సిందేనని డిమాండ్ చేశారు. భారీ స్థాయిలో ఫైన్ లు కూడా వేయాలని.. అప్పుడే బీసీసీఐ తిక్క కుదురుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో టి20 వరల్డ్ కప్ 2028 టోర్నమెంట్ పై ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2028 టోర్నమెంట్ పై (Women’s T20 World Cup 2028) బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ టోర్నమెంట్ కు పాకిస్తాన్ (Pakistan Team) వేదిక కానుంది. 2028 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ కోసం పాకిస్తాన్ లో ఉన్న స్టేడియాలను ఇప్పటికే ఫైనల్ చేసినట్టు సమాచారం. అయితే ఈ టోర్నమెంట్ పాకిస్తాన్ లో జరుగుతున్న తరుణంలో టీమిండియా పర్యటించడంపై సందిగ్ధత నెలకొంది. రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో తటస్థ వేదికలోనే టీమిండియా ( Tema India) మ్యాచ్ లు జరుగుతాయని అంటున్నారు. దుబాయ్ లేదా శ్రీలంక వేదికల్లో టీమిండియా మ్యాచ్ లు ఉండే ఛాన్స్ లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీమిండియా ఫైనల్స్ కు వెళ్లినా కూడా తటస్థ వేదిక లలోనే మ్యాచ్ ఉంటుంది. దీనిపై పాకిస్తాన్ మాజీలు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. కచ్చితంగా పాకిస్తాన్ కు ఇండియా రావాల్సిందేనని.. లేకపోతే ఆ జట్టుపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు.