Inzamam-ul-Haq: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ సాగుతోంది. అయితే మొన్న మే 22వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ అలాగే విరాట్ కోహ్లీ ( Travis Head Vs Virat Kohli Handshake Controversy) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హెడ్ ను కించపరుస్తూ విరాట్ కోహ్లీ వ్యవహరించినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది.
అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు విరాట్ కోహ్లీ. దీనిపై విరాట్ కోహ్లీని విలన్ చేస్తూ సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి క్రమంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ( Inzamam-ul-Haq) ఈ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సంఘటనలో విరాట్ కోహ్లీ ఇదే తప్పు అన్నట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీకి ఒళ్లంతా బలుపేనని.. అందుకే అలాంటి క్రికెటర్ ను పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి ( Pakistan Super League Tournament) తీసుకోనని పదే పదే చెబుతున్నట్లు గుర్తు చేశారు. దీంతో ఇంజమాం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ట్రావిస్ హెడ్ వర్సెస్ విరాట్ కోహ్లీ అంశంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ తాజాగా స్పందించారు. విరాట్ కోహ్లీకి ఈగో ఎక్కువగా ఉందని మండిపడ్డారు. పెద్ద సెల్ఫిష్ ఆటగాడు అని పరువు తీశారు. ఒక అంతర్జాతీయ క్రికెటర్ కు ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా విరాట్ కోహ్లీకి లేవని పరువు తీశారు. అందుకే విరాట్ కోహ్లీని పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులోకి తాను తీసుకోనని పదే పదే చెబుతున్నట్లు వెల్లడించారు. ఒకవేళ మతం మారితే మాత్రం ఆలోచిస్తానని వెల్లడించారు. ముస్లిం క్రికెటర్లకు మాత్రమే పాకిస్తాన్ సూపర్ లీగ్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. భారతదేశంలోని హిందూ క్రికెటర్లకు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఛాన్స్ ఉండదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. హెడ్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇంజమామ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో హెడ్ కు అవమానం జరిగితే, ఏ ఒక్క క్రికెటర్ స్పందించడం లేదని ఆగ్రహించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి డబ్బులకు క్రికెట్ ఆస్ట్రేలియా అమ్ముడుపోయిందని కూడా ఆరోపణలు చేశారు. అయితే ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు.