E-Paper
Advertisement

Mumbai Indians: ముంబై ఇండియన్స్ పై బుడ్డోడు హాట్ కామెంట్స్‌..తలదించుకున్న నీతా అంబానీ

Mumbai Indians: ముంబై ఇండియన్స్ పై బుడ్డోడు హాట్ కామెంట్స్‌..తలదించుకున్న నీతా అంబానీ
Advertisement

Mumbai Indians:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ తొమ్మిదవ స్థానంలో నిలిచి… ఎలిమినేట్ అయింది. 14 మ్యాచ్ లు ఆడితే కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ప్రక్షాళన మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) స్థానంలో కొత్త కెప్టెన్ వస్తాడని కూడా చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ పరువు తీసేలా ఓ బుడ్డోడు మాట్లాడాడు. అది కూడా ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ముందే సెటైర్లు పేల్చాడు. ఇక ఆ బుడ్డోడు చేసిన వ్యాఖ్యలు విన్న నీతా అంబానీ ( Nita Ambani) తలదించుకొని పగలబడి నవ్వింది. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

ముంబైపై బుడ్డోడు హాట్ కామెంట్స్‌..తలదించుకున్న నీతా అంబానీ

Advertisement

ముంబైలో ఉన్న ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వేడుక సందర్భంగా ఓ స్టూడెంట్ స్టేజిపై మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ పరువు తీశాడు. స్టూడెంట్ కష్టాలను… ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న సమస్యలతో పోల్చుతూ సెటైర్లు వేశాడు. మనకు ఎంతో ఇష్టమైన ముంబై ఇండియన్స్ తరహాలోనే మన జీవితంలో కూడా కొన్ని కష్టమైన రోజులు… వస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆ బుడ్డోడు. ముంబై ఇండియన్స్ లాగా మనం కూడా సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని వెల్లడించాడు.

ఐపీఎల్ 2026 సంద‌ర్భంగా ముంబై ఇండియ‌న్స్ విజ‌యం కోసం ప‌డ్డ క‌ష్టాల‌ను వివ‌రిస్తూ, ఈ కామెంట్స్ చేశాడు. ఇక ఈ కామెంట్ చేసిన వెంటనే… అక్కడే ఉన్న ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ తల దించుకొని మరి.. పగలబడి నవ్వుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన ముంబై ఇండియన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బుడ్డోడైన… సరైన మాట చెప్పాడని తెగ పొగుడుతున్నారు. ఆ బుడ్డోడి మాట వినైనా… ముంబై ఇండియన్స్ ఓనర్లు బుద్ధి తెచ్చుకోవాలని మరికొంతమంది కౌంటర్లు ఇస్తున్నారు. వెంటనే ముంబై ఇండియన్స్ జట్టులో ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ముంబై ఇండియన్స్ జట్టులో ఎలాంటి మార్పులు చేయాలంటే ?

Advertisement

ముంబై ఇండియన్స్ వచ్చే సీజన్లో అయిన బాగా రాణించాలంటే మొదటగా కెప్టెన్సీ ని మార్చాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. వెంటనే రోహిత్ శర్మ లేదా సూర్య కుమార్ యాదవ్, కాకపోతే బుమ్రాకు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్ గా కాకుండా ఫుల్ టైం ఆటగాడిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. తిలక్ వర్మ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ మార్చకుండా ఫిక్స్డ్ గా లైనప్ కొనసాగించాలని పేర్కొంటున్నారు. బుమ్రా ఆధ్వర్యంలోని బౌలింగ్ విభాగం మరింత మెరుగుపడితే అద్భుత ఫలితాలు ఖాయమని చెబుతున్నారు.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×