E-Paper
Advertisement

Kavya Maran: దేశ ద్రోహి అంటూ కావ్య పాప‌ను ట్రోల్ చేస్తున్నారు, కానీ క‌రోనా, తుఫాన్లు వ‌చ్చిన‌ప్పుడు ఇండియాను ఆదుకున్న దేవ‌త !

Kavya Maran: దేశ ద్రోహి అంటూ కావ్య పాప‌ను ట్రోల్ చేస్తున్నారు, కానీ క‌రోనా, తుఫాన్లు వ‌చ్చిన‌ప్పుడు ఇండియాను ఆదుకున్న దేవ‌త !
Advertisement

Kavya Maran:  ది హండ్రెడ్ లీగ్ వేలంలో ( The Hundred League) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed) కొనుగోలు చేసిన నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాదు ఓనర్ కావ్య పాప పై దారుణంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలో డబ్బులు సంపాదించి పాకిస్తాన్ ఆటగాడిని ఎందుకు కొనుగోలు చేస్తున్నామని కావ్య పాప పై  ( Kavya Maran) దేశద్రోహి ముద్ర వేస్తున్నారు జనాలు. అంతేకాదు కావ్య పాపకు సంబంధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపైన బ్యాన్ కూడా విధించాలని కోరుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మరికొంతమంది కావ్య పాపకు సపోర్ట్ గా నిలుస్తూ పోస్టులు పెడుతున్నారు. కరోనా, తుఫాన్లు, ఇతర ఎమర్జెన్సీ సమయాలలో భారతదేశానికి ఎంతో సహాయం చేసిందని కావ్య పాపను మెచ్చుకునే వాళ్ళు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నారు. గతంలో ఇండియాకు ఆమె చేసిన సహాయాన్ని గుర్తు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. హాట్సాఫ్ కావ్య పాప అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు మరికొంతమంది జనాలు.

Also Read: Taliban On PSL 2026: పాకిస్తాన్ స్టేడియాల్లో బాంబులు వేస్తాం…తాలిబ‌న్స్ హెచ్చ‌రిక‌లు, PSL 2026 ర‌ద్దు ?

కష్టకాలంలో ఇండియాకు అండగా నిలిచిన కావ్య పాప.. హాట్సాఫ్ అనాల్సిందే

Advertisement

కరోనా, తుఫాన్లు, ఇతర అప్రకటిత ఎమర్జెన్సీ సమయాలలో భారతదేశానికి కావ్య పాప చేసిన సహాయం అంతా ఇంతా కాదు. సన్ టీవీ నెట్వర్క్ అధినేతగా ఉన్న కావ్య పాప ఫ్యామిలీ.. సినిమా రంగంలో కూడా రాణిస్తోంది. ఈ నేపథ్యంలోనే కోట్లల్లో కావ్య పాప కుటుంబానికి ఆదాయం వస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ డబ్బులను సంపాదించడమే కాకుండా కష్టకాలంలో భారతదేశ ప్రజలకు కూడా ఖర్చుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో కావ్య పాప ఫ్యామిలీ మొత్తం 30 కోట్లు భారత ప్రభుత్వానికి ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు తమ సన్ టీవీ నెట్వర్క్ ద్వారా లక్షల్లో మాస్కులు, సానిటైజర్లు, కోవిడ్ కిట్టులు, పేదలకు ఆహార పంపిణీ లాంటి కార్యక్రమాలను చేపట్టారు. 2020 సంవత్సరంలో కరోనా రిలీఫ్ ఫండ్ కింద మరో 10 కోట్లు కూడా కావ్య పాప ఇచ్చారు. అటు సన్ టీవీ నెట్వర్క్ ద్వారా కరోనా సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ.. అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా చేపట్టారు.

తమిళనాడు రాష్ట్రంలో వేలాది మందికి కరోనా సమయంలో ఉచితంగానే భోజన ఏర్పాట్లు చేసింది కావ్య పాప. ఇక 2018లో గజ అనే భయంకరమైన తుఫాను వస్తే రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అందించి తన వంతు సహాయం చేసింది. ఇటు మిచంగ్ తుఫాన్ 2023లో రాగా ఆ సమయంలో తమిళనాడు ప్రభుత్వానికి మరో ఐదు కోట్ల రూపాయలు అందించింది. ఇలా ఎప్పుడు భారత ప్రజలకు కష్టం వచ్చినా తన వంతు సహాయంగా ఏదో ఒక రూపంలో సహాయం అందిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఎక్కడ జరిగిన వాలిపోయి.. తన జట్టును గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు కావ్య పాప. ఇలా ప్రతి మ్యాచ్కు ఏ ఒక్క ఫ్రాంచైజీ ఓనర్ వెళ్లరు. కానీ కావ్య పాప మాత్రం , ప్రతి మ్యాచ్ కు హాజరై… సందడి చేస్తూ ఉంటారు. అలాంటి కావ్య పాప పై దేశద్రోహి ముద్ర ఎలా వేస్తారని మండిపడుతున్నారు జనాలు. బీసీసీఐ రూల్స్ ప్రకారం అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడం తప్పేం కాదని అంటున్నారు కదా…? ఇంకా ఎందుకు కావ్య పాప పై ఏడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

 

Also Read: Moin Khan: ఐపీఎల్ అంటేనే బ్లాక్ మ‌నీ దందా, ఫిక్సింగ్..PSL ముందు నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నికిరాదు

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×