Inzamam-ul-Haq: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ ( vaibhav Suryavanshi ) నిన్న అదరగొట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Rajasthan Royals vs Mumbai Indians) మధ్య ఫైట్ జరగగా, కేవలం 14 బంతుల్లో 39 పరుగులతో రాణించాడు వైభవ్ సూర్యవంశీ. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టిన వైభవ్ సూర్య వంశీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అయితే ఈ క్రమంలో వైభవ్ సూర్య వంశీ బౌలింగ్ పైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుమ్రా ( Bumrah ) బౌలింగ్ లో ఆడడం ఎవరి తరం కాదని.. కానీ 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ఆడడం చాలా వింతగా ఉందని తెలిపారు. వెంటనే వైభవ్ సూర్య వంశీకి డోపింగ్ టెస్టులు ( Doping tests ) నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇంజమాం. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
Also Read: Inzamam-ul-Haq: కేకేఆర్, పంజాబ్ మ్యాచ్ రద్దు వెనుక కుట్రలు…క్లౌడ్ బరస్ట్ క్రియేట్ చేశారంటూ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న బిగ్ ఫైట్ జరిగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 11 ఓవర్లకు కుదించారు. అయినప్పటికీ అద్భుతంగా రాణించిన రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టి వైభవ్ సూర్యవంశీ హాట్ టాపిక్ అయ్యాడు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్య వంశీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq). 15 సంవత్సరాల వయసులోనే నెంబర్ వన్ బౌలర్ బుమ్రాను ఎదుర్కోవడం గ్రేట్ అన్నారు. అలాంటి బౌలర్ ను ఎదుర్కోవాలంటే దమ్ము ఉండాలి.. ఆ దమ్ము, ధైర్యం వైభవ్ సూర్యవంశీకి ఉంది అంటూ వ్యాఖ్యానించారు. అయితే అతన్ని మెచ్చుకుంటూనే, షాకింగ్ ఆరోపణలు చేశాడు ఇంజమామ్.
బుమ్రా లాంటి బౌలర్ ను ఎదుర్కొన్న వైభవ్ సూర్య వంశీకి ఒక్కసారి డోపింగ్ టెస్టులు నిర్వహించాలని కోరారు. ఇందులో అతడు స్టెరాయిడ్స్ తీసుకున్నాడా ? లేదా ? అనే విషయం తేటతెల్లమవుతుందని స్పష్టం చేశారు. వెంటనే దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో వైభవ్ సూర్యవంశీని ఆపడం ఎవడి తరం కాదన్నారు. అతని వాలకం చూస్తుంటే కచ్చితంగా స్టెరాయిడ్స్ తీసుకున్నాడని అర్థమవుతుందని షాకింగ్ ఆరోపణలు చేశారు. మరి దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అదే సమయంలో ఇండియన్ ఫ్యాన్స్ ఇంజమాంకు కౌంటర్ ఇస్తున్నారు. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ అంటే అందరికీ హాడల్ అని.. అతడికి భయపడి ఇలా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
Also Read: Farhan – Smith: సింగిల్ తీయకుండా స్మిత్ ను అవమానించిన ఫర్హాన్..బాబర్ పగను తీర్చుకున్నాడుగా