E-Paper
Advertisement

SRH Vs RR Match Highlights: హైదరాబాద్ మ్యాచ్ లో.. వింతలు-విశేషాలు!

SRH Vs RR Match Highlights: హైదరాబాద్ మ్యాచ్ లో.. వింతలు-విశేషాలు!
Advertisement

Sunrisers Hyderabad Vs Rajasthan Royals Match Highlights: ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎప్పుడెవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారనేది ఎవరి చేతుల్లో ఉండదు. చివరి వరకు గెలుస్తారని భావించిన రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయంది. అయిపోయిందిరా హైదరాబాద్ పని అనుకున్నది చివరికి గెలిచింది. ఇలా ఉత్కంఠభరితమైన పోరులో జరిగిన ఎన్నో వింతలు, విశేషాలు, రికార్డులను ఒకసారి చూసేద్దాం…

ఐపీఎల్ లో పరుగుల పరంగా చూస్తే రాజస్థాన్ అతి తక్కువ పరుగుల తేడాతో ఓటమి పాలు కావడం ఇది రెండోసారి. మొదటిసారి 2012 సీజన్ లో ఢిల్లీపై ఒక్క పరుగు తేడాతో ఇలాగే ఓటమి పాలైంది.

Advertisement

ఐపీఎల్ లో ఓడిపోయిన మ్యాచ్ లో అత్యధిక భాగస్వామ్యం నమోదైన రెండో జోడీ గా యశస్వి జైశ్వాల్- రియాన్ పరాగ్ నిలిచారు. ఇద్దరూ హైదరాబాద్ పై మూడో వికెట్ కు 134 పరుగులు జోడించారు. అంతకుముందు 2018లో బెంగళూరుపై కేన్ విలియమ్సన్-మనీశ్ పాండె (135) చేశారు.

Also Read: అప్పటివరకు టెన్షన్‌.. విజయం తర్వాత కావ్యమారన్ ఎగిరి..

Advertisement

ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన హైదరాబాద్ ఆటగాళ్ల జాబితాలో 8 సిక్స్ లతో డేవిడ్ వార్నర్, మనీశ్ పాండె, క్లాసెన్, తాజాగా హెడ్, నితీశ్ రెడ్డి చేరారు.

ఐపీఎల్ సీజన్ 2024లో మొత్తం ఆరు మ్యాచ్ ల్లో టార్గెట్లను కాపాడుకుని, ఐదు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఒకదాంట్లో ఓటమి పాలైంది.

ఐపీఎల్ లో అతి తక్కువ పరుగుల తేడాతో విజయం సాధించడం హైదరాబాద్ కి ఇదే తొలిసారి. ఇదే సీజన్ లో పంజాబ్ పై 2 పరుగుల తేడాతో గెలిచింది.

Also Read: T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ టీమ్ ప్రదర్శనతో బెంబేలు..! ఇలా ఆడితే కప్పు ఎలా..?

ఎట్టకేలకు హైదరాబాద్ విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలను పదిలం చేసుకుంది. ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఇంకా నాలుగు మ్యాచ్ లు ఆడాల్సినవి ఉన్నాయి.

మరో 2 గెలిస్తే మాత్రం 16 పాయింట్లతో కళ్లు మూసుకుని ప్లే ఆఫ్ కి చేరుతుందని సీనియర్లు చెబుతున్నారు. పోనీలే రూ.20 కోట్లు పెట్టి కెప్టెన్ కమిన్స్ ని కొన్న హైదరాబాద్ ఫ్రాంచైజీకి తను న్యాయం చేశాడని అందరూ నెట్టింట కొనియాడుతున్నారు.

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×