BigTV English

Prasanth Varma PVCU: సినిమాల్లో నటించాలని ఉందా..? ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపరాఫర్..!

Prasanth Varma PVCU: సినిమాల్లో నటించాలని ఉందా..?  ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపరాఫర్..!

Prasanth Varma Offers Movie Chance in PVCU: క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ఏడాది ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎవరూ ఊహించని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రూ.45 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.300 కోట్లు కొల్లగొట్టి అబ్బురపరచింది.


ఈ మూవీని దర్శకుడు ప్రశాంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. విఎఫ్ఎక్స్ వర్క్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దీనికి సీక్వెల్‌ను దర్శకుడు ప్రకటించాడు. ఈ సీక్వెల్‌ మూవీని ‘జై హనుమాన్’ పేరుతో రూపొందిస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి.

‘జై హనుమాన్’ నుంచి ఇప్పటికే కొన్ని అప్డేట్‌లను వదులుతూ.. హైప్ పెంచారు. ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి అందరిలోనూ ఆసక్తి రేకెత్తించారు. ఇకపోతే జై హనుమాన్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతో గ్రాండ్‌ లెవెల్లో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే.. స్టార్ట్ నటీ నటులను ఇందులో భాగం చేస్తున్నాడు.


Also Read: జై హనుమాన్ అప్డేట్.. వీడియో రిలీజ్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ..

ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ తాజాగా ఓ అప్డేట్ అందించాడు. ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో చేరవల్సిందిగా ఓ ఆహ్వానాన్ని పంపాడు. దీంతో మూవీపై మంచి ఉత్సాహం, సినిమాలో చేయాలనే కోరిక ఉండేవాళ్ళకు మంచి అవకాశంగా మారింది. అయితే మరి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏమని చెప్పాడో తెలుసుకుందాం.

‘‘కళాకారులందరినీ పిలుస్తూ, సూపర్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం! మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? ఇది స్పిన్నింగ్ టేల్స్, ఎడిటింగ్, గ్రాఫిక్స్‌తో మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం ఉందా.. లేదా గొప్పగా మార్కెటింగ్ చేయగలరా.. మీ అవగాహన నైపుణ్యాలతో ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ఉందా?. మీకున్న గొప్ప కళాత్మక నైపుణ్యాలేంటో చెప్పండి. మనం కలిసి కొత్త వరల్డ్ క్రియేట్ చేద్దాం. మీ పోర్ట్‌ఫోలియోలను ‘talent@thepvcu.com’ ద్వారా తెలియజేయండి’’ అంటూ ఓ సోషల్ మీడియాలో తెలియజేశాడు. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలాడు.

Also Read: Aishwarya Rajinikanth: కొత్త ఇంటిని కొనుగోలు చేసిన ఐశ్వర్య రజినీకాంత్‌.. సూపర్ స్టార్ స్మైల్ చూశారా?

దీని బట్టి యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, గాఫిక్స్ ఇలా ఏ రంగంలోనైనా టాలెంట్ ఉంటే అలాంటి వారు వారి డీటెయిల్స్‌ని తాను చెప్పిన మెయిల్‌కు పంపించాలని కోరాడు. దాని ద్వారా పీవీసీయూలో అవకాశం పొందవచ్చు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×