Kavya Maran Jumps in enjoy after SRH Thrilling Victory Over RR in IPL 2024: సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు.. అందరి చూపులు ఒక్కరిపైనే. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్యమారన్. సన్ గ్రూప్ ఛైర్మన్, ఫౌండర్ అయిన కళానిధి మారన్ గారాలపట్టి. కొన్నాళ్ల వరకు ఆమె ఎవరో ఎవరికీ తెలీదు. ఐపీఎల్ పుణ్యమాని ఆమె బాగా ఫేమస్ అయ్యారు. స్టేడియంలో కావ్య ఎక్కడుంటే కెమెరాలు ఆమెని ఓ కంట కనిపెడతాయి. ఆమె హావభావాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నాయి.
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికొద్దాం. వరసగా రికార్డు స్థాయిలో మ్యాచ్‌లు గెలిచిన హైదరాబాద్ జట్టు.. తర్వాత రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రమే ఆ జట్టు గెలుస్తుందని, సెకండ్ బ్యాటింగ్ అయితే ఓటమి ఖాయమని క్రికెట్ లవర్స్ అనుకున్నారు.. దాదాపు అదే నిజమైంది కూడా.
Also Read: SRH vs RR Match Highlights : హైదరాబాద్ మ్యాచ్ లో.. వింతలు-విశేషాలు
ఇక అసలు విషయానికొద్దాం.. గురువారం రాత్రి హైదరాబాద్- రాజస్థాన్ జట్ల మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాకపోతే మునిపటి మ్యాచ్‌ల మాదిరిగా పరుగుల తుఫాను పెద్దగా కనిపించలేదు. మ్యాచ్ చివరివరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఒక పరుగు తేడాతో రాజస్థాన్‌పై హైదరాబాద్ జట్టు విజయం సాధించింది.
దీంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్యమారన్ ఆనందానికి అవధుల్లేవు. స్టేడియంలో అప్పటివరకు మ్యాచ్ చూస్తూ టెన్షన్‌కు లోనయ్యారు. మ్యాచ్ గెలుస్తుందా లేదా అన్న డౌట్ ఆమెని అనుక్షణం వెంటాడింది. జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించాక ఆమె ఆనందం అంతాఇంతా కాదు. ఏకంగా ఎగిరి గంతేశారు.. సంతోషంతో నవ్వుతూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతుకుముందు ఓడిపోయిన మ్యాచ్‌లో కావ్య ఏడ్చినంత పని చేశారు. జట్టు ఓటమిని ఆమె జీర్ణించుకోలేకపోయిన సందర్భాలు ఉన్నాయి.
Also Read: ఉత్కంఠ పోరులో హైదరాబాద్ గెలుపు.. పోరాడి ఓడిన రాజస్థాన్ రాయల్స్
చివరి 18 బంతుల్లో హైదరాబాద్ జట్టు గెలవడానికి 27 పరుగులు మాత్రమే మిగిలివున్నాయి. కానీ చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉంది. రాజస్థాన్ ఆటగాడు రోమన్ పావెల్‌ను భువనేశ్వర్‌కుమార్ అవుట్ చేయడంతో హైదరాబాద్ జట్టు ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ గెలిచింది.
Jumps of Joy in Hyderabad 🥳
Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡
Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc
— IndianPremierLeague (@IPL) May 2, 2024