BigTV English

Suryakumar’s wife : ఆ కుర్రాడితో సూర్య భాయ్ భార్య.. అసలు ముంబై ఏం జరుగుతోంది

Suryakumar’s wife : ఆ కుర్రాడితో సూర్య భాయ్ భార్య.. అసలు ముంబై ఏం జరుగుతోంది

Suryakumar’s wife : ఐపీఎల్ 2025 సీజన్ లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు కొన్ని టీమ్ లను ట్రోలింగ్ చేశారు నెటిజన్లు. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆప్స్ కి చేరుకోకపోవడంతో ఈ జట్ల పై రకరకాల విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ ప్లే ఆప్స్ కి చేరుకోవడంతో నిన్న కర్ణాటకలో ముగ్గురు యువకులు మేకను బలి ఇస్తుండగా.. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మొన్న ఢిల్లీ-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. అయితే ఆ సమయంలో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు.


Also Read :  MI VS GT: గుజరాత్ పై అంబానీ కుట్రలు.. తిప్పి కొట్టిన గిల్ !

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అది ఏంటంటే..? ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ భార్యతో విఘ్నేష్ పుతూర్ చిట్ చాట్ చేశారు. నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగాs వారు మాట్లాడుకుంటూ స్టేడియం బయటికీ వచ్చారు. ప్రస్తుతం  ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 18 సీజన్ ని ముంబై జట్టు పేలవంగా ప్రారంభించింది. ఆ తరువాత పుంజుకొని వరుసగా ఆరు విజయాలతో ప్రత్యర్థులకు దడ పుట్టించింది. తాజాగా తనకు ఎదురే లేనట్టు కనిపించిన ముంబై జట్టు కి సొంత గడ్డ పై ఝలక్ ఇచ్చింది గుజరాత్ టైటాన్స్. ఓవైపు వర్షం.. మరోవైపు తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.


వాంఖడే లో తీవ్ర ఉత్కంఠ భరితమైన సాగిన మ్యాచ్ లో చివరికీ గుజరాత్ జట్టు ముంబై ని ఓడించింది. తొలుత ముంబై జట్ట 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ 53, సూర్యకుమార్ 35 పరులు చేసి రాణించారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 2 వికెట్లు, రషీద్ ఖాన్ 1,  అర్షద్ ఖాన్ 1, సిరాజ్ 1 వికెట్ తీశారు. వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి గుజరాత్ 18 ఓవర్లలో 132/6 తో నిలిచింది. మళ్లీ ఆట మొదలయ్యాక ఒక ఓవర్లో 15 పరుగులు గా మారింది. దీపక్ చాహర్ బౌలింగ్ లో మొదటి బంతికే ఫోర్ కొట్టిన తెవాటియా. రెండో బంతికి సింగిల్ తీశారు. మూడో బంతికి కొయట్టీ సిక్సర్ బాదేశాడు. నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. అది నోబాల్.. తరువాత తెవాటియా సింగిల్ తీశాడు. 2 బంతుల్లో 1 పరుగే చేయాలి. కొయెట్జీ 5బంతికి ఔట్ అయ్యాడు. దీంతో ఉత్కంఠ నెలకొంది. అర్షద్ ఖాన్ చివరి బంతికి సింగిల్ తీసి ఉత్కంఠ కి  తెరదించాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అయితే ఈ బంతికి రనౌట్ ఛాన్స్ ని మిస్ చేసుకుంది ముంబై ఇండియన్స్. రనౌట్ అయితే మళ్లీ  సూపర్ ఓవర్ జరిగే అవకాశం ఉండేది.

?igsh=MnZzcjhwbjkyN3dl

Related News

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

Big Stories

×