IDBI BANK Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ (IDBI BANK) లో పలు ఉద్యోగాలను నింపిందేకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో 60 శాతం మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ (IDBI BANK) దేశ వ్యాప్తంగా పలు బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 676
ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ (IDBI BANK) లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం) గ్రేడ్- ఓ: 676 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉండగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉండగా.. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 మే 8
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మే 20
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి భర్తీ చేస్తారు.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఏడాదికి రూ.6లక్షల వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1050 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.idbibank.in/
Also Read: AAI Recruitment: డిగ్రీతో ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000 జీతం
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 676
దరఖాస్తుకు చివరి తేది: మే 20
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్