Operation Sindoor: అజ్మల్ కసబ్ గుర్తున్నాడా? 2008లో మన దేశంపై మారణహోమానికి పాల్పడ్డ ముష్కరుడు. ఆ కసబ్ కు శిక్షణనిచ్చి భారత్ పై ఉసిగొల్పిన ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్ ను మన సైనికులు తుక్కుతుక్కుగా ధ్వంసం చేశారు. ఇకపై అక్కడ ఏ ఉగ్రవాద శిక్షణ జరగకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ శిక్షణ కాదు కదా, అక్కడ పచ్చిగడ్డి కూడా మొలవదు. అలా మన సైనికులు రివేంజ్ తీర్చుకున్నారు.
కసబ్ గుర్తున్నాడా?
2008లో నవంబర్ 26వ తేదీన జరిగిన ముంబాయి దాడి అందరికీ గుర్తుండే ఉంటుంది. అదొక భయానక దాడి. సముద్ర మార్గాన మన దేశానికి వచ్చి మరీ, మనపై దారుణ కాల్పులకు పాల్పడ్డ ఉగ్రమూకలను స్పెషల్ ఆపరేషన్ ద్వారా మన సైనికులు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ ముష్కరులలో అజ్మల్ కసబ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెల్సిందే. ఈ ఉగ్రదాడిలో పలువురు పోలీస్ అధికారులు ప్రాణాలు అర్పించారు. కానీ కసబ్ ను మాత్రం ప్రాణాలతో పట్టుకొని అంతర్జాతీయ స్థాయిలో మన సైనికులు, పాకిస్తాన్ ను దోషిగా చూపెట్టడంలో మన దేశం విజయం సాధించింది. ఆ తర్వాత కసబ్ కు ఉరిశిక్ష విధించిన విషయం మనకు తెల్సిందే.
పాకిస్తాన్ ది పాడుబుద్ధే..
కసబ్ ను పట్టుకొని పాకిస్తాన్ ముందు అన్ని ఆధారాలు ఉంచినా మాకు సంబంధం లేదని బుకాయించడమే పాకిస్తాన్ పాడుబుద్ధికి నిదర్శనం. అయితే ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే, కసబ్ లాంటి ఉగ్రవాదులను మేపడంలో పాకిస్తాన్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తన పని తాను సాగిస్తూ, ఉగ్రవాదాన్ని పోషిస్తూ తన బుద్ధి పోగొట్టుకోలేదు. ఏకంగా చదువు మాటున ఉగ్రవాద పాఠాలు నేర్పిస్తూ, పాకిస్తాన్ దొంగ యవ్వారాలు నడుపుతోంది.
టార్గెట్ చేసి మరీ..
మన సైనికుల ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రధాన కేంద్రమైన మురిద్కే మార్కజ్ పూర్ణంగా ధ్వంసమైంది. ఇదే చోట 26/11 ముంబయి దాడుల్లో పాల్గొన్న అజ్మల్ కసబ్ శిక్షణ పొందినట్టు అధికారిక సమాచారం. తెల్లవారుజామున 1:05 గంటలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో భారత వాయుసేన రఫేల్ యుద్ధవిమానాల ద్వారా హామ్మర్, స్కాల్ప్ మిస్సైళ్లతో దాడి జరిపింది. ఈ దాడిలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు ఛిద్రమయ్యాయి. వాటిలో ముఖ్యమైనది – లష్కరే తోయిబా ప్రధాన కేంద్రమైన మురిద్కే మార్కజ్.
ట్రైనింగ్ ఇక్కడే..
పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలోని ప్రముఖ ఉగ్ర శిక్షణా కేంద్రమే మురిద్కే మార్కజ్. ప్రపంచ వ్యాప్తంగా నిషేధితమైన లష్కరే తోయిబా సంస్థకి ఇది కేంద్రంగా పనిచేస్తుంది. అజ్మల్ కసాబ్, అతడి ముఠా 26/11 ముంబయి దాడులకు ఇక్కడే శిక్షణ పొందారు. వీరందరికీ చదువు మాటున తుపాకి పాఠాలు చెప్పి మరీ పాకిస్తాన్ వీరిని మన దేశంపైకి కాల్పులకు పంపింది. అందుకే నేడు తగిన శాస్తి జరిగిందని చెప్పవచ్చు.
Also Read: IPL 2025 – Operation Sindoor: పాకిస్థాన్ పై యుద్ధం.. IPL 2025 రద్దు.. బీసీసీఐ ప్రకటన ఇదే ?
ఇప్పటికైనా బుద్ధి మారేనా?
వంకర బుద్ధి గల దేశాలలో మొదటి పాకిస్తాన్ కే దక్కుతుంది. ఉగ్రవాదం తన దేశ పౌరులను మట్టుబెడుతున్నా, మాకు ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధం లేదని బుకాయించడంలో పాకిస్తాన్ కు అందె వేసిన చెయ్యి. అందుకే మన దళాలు కుక్క కాటుకు చెప్పు దెబ్బ స్టైల్ లో ఆపరేషన్ సింధూరం ద్వారా బుద్ధి చెప్పినా, పాకిస్తాన్ తీరులో మార్పు రాదని ఇతర దేశాలు అంటున్నాయి. ఇప్పటికే తన దొంగ బుద్ధి ద్వారా కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ కు మన సైన్యం తగిన రీతిలో బుద్ధి చెప్పి మూలన కూర్చోబెట్టింది. పాకిస్తాన్ తోక జాడిస్తే, ఇక నీకు బరువే అంటున్నారు మన ఇండియన్స్. మొత్తం మీద కసబ్ లాంటి ఉగ్రమూకకు ట్రైనింగ్ ఇచ్చిన స్థావరాన్ని ధ్వంసం చేయడంలో మన సైనికులు విజయాన్ని అందుకున్నారు. మరెందుకు ఆలస్యం.. సెల్యూట్ చేద్దాం.. జై జవాన్ అంటూ మన సైనికుల పోరాటపటిమను అభినందిద్దాం.