E-Paper
Advertisement

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి మాస్ డైలాగ్స్‌కు.. సరిగ్గా మూడేళ్లు.. రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయ్..!

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి మాస్ డైలాగ్స్‌కు.. సరిగ్గా మూడేళ్లు.. రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయ్..!
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు తన పదునైన వ్యూహాలు, ప్రత్యర్థులను ఇరుకున పెట్టే వాక్ చాతుర్యంతో రాజకీయ ఉద్దండులను సైతం లాక్ చేసేస్తున్నారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాతే ఆయనలోని రాజకీయ పటిమ అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో సరిగ్గా మూడేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరోమారు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ శ్రేణులు దానిని వైరల్ చేస్తూ.. బీఆర్ఎస్ కు చురకలు అంటిస్తున్నారు.

ఇంతకీ రేవంత్ డైలాగ్స్ ఏంటంటే?

తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళాన్ని విప్పుతూ వచ్చారు. ఓ దశలో 9 నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. అయితే దీనిపై అప్పట్లో కేటీఆర్ అసెంబ్లీలో స్పందిస్తూ.. 9 నెలల్లో పిల్లలు వస్తారు గానీ అధికారం రాదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ మాట్లాడుతూ ‘9 నెలల్లో పిల్లలను పుట్టించేది చేతనైతే.. 9 నెలల్లో అధికారం వచ్చేది కూడా చేతనైతది. కేటీఆర్ కు తెలియకపోతే తెలుసుకోవాలి’ అంటూ మాస్ కౌంటర్ ఇచ్చారు.

Advertisement

మాట నిలబెట్టుకున్న కౌంటర్..

సీఎం రేవంత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్లే.. సరిగ్గా 9 నెలలు తిరిగే సరికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన చెక్ పెట్టి.. తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అదీష్టించారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు చేసి మూడేళ్లు అయిన సందర్భంగా.. కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాలు.. ఆ డైలాగ్స్ ను తిరిగి తెరపైకి తీసుకొస్తున్నాయి. అప్పట్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. దానికి రేవంత్ రెడ్డి కౌంటర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

రేవంత్‌ను ప్రత్యేకంగా నిలిపే గుణాలు

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేని సమయంలో పీసీసీ (TPCC) అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని.. కేవలం రెండు మూడేళ్లలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం రేవంత్ రెడ్డి ఆయన వ్యూహరచనకు నిదర్శనం. పదేళ్ల బలమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజకీయాల్లో సవాలు చేయడం.. దానిని నిజం చేయడం ఆయనలోని పట్టుదలకు పారిపాటిగా నిలుస్తోంది.

Also Read: IndiGo Flight: విశాఖ నుంచి బయల్దేరిన ఫ్లైట్‌లో.. సాంకేతిక సమస్య.. దిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ!

పాలనాపరమైన దూకుడు

సీఎం అయిన వెంటనే ‘ఆరు గ్యారంటీలు’ అమలు దిశగా అడుగులు వేయడం, రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం వంటి నిర్ణయాలతో తనదైన ముద్ర వేశారు రేవంత్. హార్వర్డ్ వంటి అంతర్జాతీయ వేదికలపై నాయకత్వ శిక్షణకు ఎంపిక కావడం ద్వారా తన పరిజ్ఞానాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: Viral Video: పెట్రోల్ కోసం ఏకంగా బైకు ట్యాంకే పీక్కొని వచ్చేశాడు.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆగదు!

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×