E-Paper
Advertisement

Kavya Maran: కావ్య మారన్ దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు..పాకిస్తాన్ జెర్సీతో ఫోటోలు మార్ఫింగ్ చేసి

Kavya Maran: కావ్య మారన్ దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు..పాకిస్తాన్ జెర్సీతో ఫోటోలు మార్ఫింగ్ చేసి
Advertisement

Kavya Maran:  సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad) ఓనర్ కావ్య పాప ట్రోలింగ్ కు గురవుతున్నారు. నిన్నటి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కావ్య పాప దేశద్రోహి అంటూ దారుణంగా పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు ఓనర్ గా కావ్య పాప ఉన్నారు. ఇంకేముంది కావ్య పాపను టార్గెట్ చేసి దేశ ద్రోహి అంటూ ఇండియన్స్ పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: Boycott SRH: బాయ్ కాట్ స‌న్ రైజ‌ర్స్ అంటూ ట్రోలింగ్‌..పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను కొనడంపై వివాదం

కావ్య పాప దేశద్రోహి అంటూ పోస్టులు

Advertisement

‘ది హండ్రెడ్ ‘ లీగ్ టోర్నమెంట్ వేలం నిన్న లండన్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో ‘ది హండ్రెడ్ ‘ లీగ్ టోర్నమెంట్ ( The Hundred Auction ) జరుగుతోంది. అయితే ఈ టోర్నమెంట్ లో కావ్య పాపకు ( Kavya Maran) సంబంధించిన సన్రైజర్స్ లీడ్స్ జట్టు కూడా ఆడుతోంది. అయితే ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం నిన్న నిర్వహించారు. ఇందులో వేలానికి పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ వచ్చాడు. ఈ సంద‌ర్భంగా పాక్ బౌలర్ అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ లీడ్స్ ( Sunrisers Leeds) వేలంలో దక్కించుకుంది.

పాక్ బౌలర్ అబ్రార్ అహ్మద్ ను రూ.2.34 కోట్లకు కొనుగోలు చేశారు కావ్యా పాప‌. దీంతో కావ్య మార‌న్ పై దారుణంగా ట్రోలింగ్ చేశారు. భారత సైన్యాన్ని అవమానించిన అబ్రార్ ను .. ఎలా తీసుకుంటారంటూ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. కోట్లాది మంది భారతీయుల మనోభావాలతో.. ఆడుకుంటున్నారంటూ కావ్యపై ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. కావ్య మారన్ దేశద్రోహి అంటూ కొంద‌రు విమర్శలు చేస్తున్నారు. దేశ భక్తి కంటే వ్యాపారమే ముఖ్యమా అంటూ ప్రశ్నిస్తున్నారు. కావ్య మారన్ దేశ ద్రోహి అంటూ పాకిస్తాన్ జెర్సీతో ( Pakistan Jersy) ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆడుకుంటున్నారు.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వివాదంపై బీసీసీఐ క్లారిటీ

Advertisement

పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ కావ్య పాప ( KAvya papa) కొనుగోలు చేయడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. ‘ది హండ్రెడ్ ‘ టోర్నమెంట్ అనేది బీసీసీఐ పరిధిలోకి రాదని వెల్లడించింది. లండన్ కు సంబంధించిన ఈ టోర్నమెంటులో హైదరాబాద్ ఓనర్ కావ్య పాప ఏ ప్లేయర్ ను అయినా కొనుగోలు చేయవచ్చునని… ఆమెను తాము ఆపలేమని కుండ బద్దలు కొట్టి చెప్పింది. ఐపీఎల్ టోర్నమెంట్ లో మాత్రం పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేయకుండా రూల్స్ కఠినంగా ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ అబ్రార్ అహ్మద్ విషయంలో తామేమి చేయలేమని చేతులు దులుపుకుంది బీసీసీఐ.

 

Also Read: Chatgpt On IPL 2026: ఐపీఎల్ 2026 విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసిన చాట్ జీపీటీ..పర్పుల్ క్యాప్ అత‌నికే

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×