Boycott SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ( T20 World Cup 2026 tournament) మంచి ఆదరణ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై ( Sunrisers Hyderabad) తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బాయ్ కాట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( Boycott SRH ) అంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదని.. ఆ జట్టును బాయ్ కాట్ చేయాలని కోరుతున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఇంగ్లాండ్ నిర్వహిస్తున్న ది హండ్రెడ్ ( Men’s Hundred 2026 Auction ) వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ( Abrar Ahmed ) ను కావ్య పాప కొనుగోలు చేసింది. దీంతో విమర్శలు తారా స్థాయికి చేరాయి. ఈ దెబ్బకు బాయ్ కాట్ సన్ రైజర్స్ హైదరాబాద్ అంటూ నినాదాలు కూడా మొదలయ్యాయి.
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం ఐపీఎల్ తరహాలోనే ది హండ్రెడ్ ( Men’s Hundred 2026 Auction ) లీగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ది హండ్రెడ్ లీగ్ కు సంబంధించిన వేలం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ( SunRisers) ఓనర్ కావ్య పాప కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని ఫ్రాంచైజీలు పాకిస్తాన్ ప్లేయర్లు వస్తే వదిలేశారు. కానీ కావ్య పాప మాత్రం పాకిస్తాన్ ప్లేయర్ ను కొనుగోలు చేసి వివాదానికి తెరలేపింది. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed ) సన్రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేసింది.
ఈ జట్టుకు కావ్య పాప ఓనర్ అన్న సంగతి తెలిసిందే. రూ. 2.34 కోట్లకు పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా బాయ్ కాట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మన ఇండియన్ ఆర్మీ ని, భారతదేశాన్ని అవమానించే వ్యక్తిని కొనుగోలు చేయడం దారుణమని ఫైర్ అవుతున్నారు క్రికెట్ అభిమానులు. ఐపీఎల్ అనుబంధ ప్రాంచీలు అన్ని పాకిస్తాన్ ప్లేయర్లను అవాయిడ్ చేసినప్పటికీ.. కావ్య పాప కొనుగోలు చేయడంపై మండిపడుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మొదట పాకిస్తాన్ ప్లేయర్లు ఆడిన సంగతి తెలిసిందే. అయితే 2008 సీజన్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్ లపై నిషేధం విధించారు. రెండు దేశాల మధ్య సంబంధాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లు ఎవరూ కూడా.. ఐపీఎల్ ఆడకూడదని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటినుంచి పాకిస్తాన్ ప్లేయర్లు నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగానే పాకిస్తాన్ సూపర్ లీగ్ పేరుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త లీగ్ తీసుకువచ్చింది. ఇలాంటి నేపథ్యంలో కావ్య పాప పాకిస్తాన్ ప్లేయర్ ను కొనుగోలు చేయడం వివాదంగా మారింది.
🚨 Kavya Maran's franchise Sunrisers Leeds acquired Pakistan spinner Abrar Ahmed for £190k.
Abrar was literally used to mock India with the having tea picture and used to mock Indian players with unwanted celebrations in Asia Cup.
Shame on you SRH 🤦
pic.twitter.com/U0xvq072Eo— Tejash (@Tejashyyyyy) March 12, 2026