E-Paper
Advertisement

DSSSB Jobs 2026: సబార్డినేట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు, మంచివేతనం, క్వాలిఫికేషన్ ఇదే

DSSSB Jobs 2026: సబార్డినేట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు, మంచివేతనం, క్వాలిఫికేషన్ ఇదే
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 216 ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం, అకౌంట్స్, లీగల్, ఐటీ, పబ్లిక్ రిలేషన్స్) వంటి కీలక విభాగాలతో పాటు రేడియో గ్రాఫర్, ఆప్టోమెట్రిస్ట్, రిపోర్టర్, పట్వారీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 వంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ కొలువు సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు.

Advertisement

విద్యార్హతలు: ప్రతి పోస్టుకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. టూరిజం విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ కావాలనుకునే వారు మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అకౌంట్స్ విభాగానికి సీఏ లేదా సీఎంఏతో పాటు మూడేళ్ల అనుభవం తప్పనిసరి. లీగల్ విభాగానికి ఎల్‌ఎల్‌బీ చదివి ఉండాలి. సైన్స్ బ్యాగ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు రేడియో గ్రాఫర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. కేవలం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు పట్వారీ పోస్టులకు పోటీ పడవచ్చు.

ఇతర పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

Advertisement

వయోపరిమితి: సాధారణంగా అభ్యర్థుల వయస్సు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.

జీతం: ఎంపికైన వారికి మంచి వేతనం ఉంటుంది. పోస్టును బట్టి నెలకు  రూ. 18,000 నుంచి గరిష్ఠంగా రూ. 1,51,100 వరకు జీతం లభిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియలో భాగంగా టైర్-1, టైర్-2 పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయి.

అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే పరీక్షలో నెగటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. కొన్ని ప్రత్యేక పోస్టులకు స్కిల్ టెస్ట్ లేదా ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు రూ. 100 మాత్రమే కాగా.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఈ ఫీజు నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు.

దరఖాస్తు విధానం: అర్హత ఉన్న వారు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 27, 2026 మధ్యాహ్నం 12 గంటల నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు సమర్పించడానికి మార్చి 28, 2026 రాత్రి 11:59 గంటల వరకు సమయం ఇచ్చారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా అధికారిక వెబ్‌సైట్ https://dsssbonline.nic.in ద్వారా వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలి. దిల్లీలో స్థిరపడాలనుకునే వారికి ఈ నోటిఫికేషన్ ఒక సువర్ణావకాశం.

ALSO READ: RITES Limited: రూ.2 లక్షల జీతం ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×