E-Paper
Advertisement

SRH Retention 2026: SRH రిటైన్ లిస్ట్ ఇదే..కాటేర‌మ్మ కొడుకు వ‌చ్చేశాడు.. ష‌మీతో పాటు వాళ్లంద‌రూ

SRH Retention 2026: SRH రిటైన్ లిస్ట్ ఇదే..కాటేర‌మ్మ కొడుకు వ‌చ్చేశాడు.. ష‌మీతో పాటు వాళ్లంద‌రూ
Advertisement

SRH Retention 2026: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 Tournament) నేపథ్యంలో నేటితో ఐపీఎల్ రిటెన్షన్ ( SRH Retention 2026) ప్రక్రియ ముగిసింది. ఇక డిసెంబర్ 15వ తేదీన మినీ వేలం అబుదాబిలో (Abu Dhabi
) జరగనుంది. మార్చి 15వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఐపిఎల్ రిటెన్షన్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ ప్లేయర్ ను వదిలేసింది, అలాగే ఏ ప్లేయర్ ను మళ్లీ రిటర్న్ చేసుకుంది అనే వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ లిస్టు ప్రకారం కాటేరమ్మ కొడుకు హేన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen ) మరోసారి రిటైన్ చేసుకుంది కావ్య పాప ( Kavya Maran). కానీ మహమ్మద్ షమీని మాత్రం ట్రేడ్ ప్రక్రియ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్‌ కు ఇచ్చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad).

Also Read: KKR: అన్ని జట్లు తోపు ప్లేయర్లను కొనుగోలు చేస్తే, KKR మాత్రం కోచ్ లను తెచ్చుకుంటుంది.. వీళ్ళు ఏంటో, వీళ్ళ కట్టుబాట్లు ఏంటో

సన్రైజర్స్ హైదరాబాద్ రిటైన్ ప్లేయర్లు వీళ్లే ( SRH Retention 2026)

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఎలాగైనా టైటిల్ గెలవాలన్న లక్ష్యంతో సన్రైజర్స్ యాజమాన్యం ( SRH ) ముందుకు దూసుకు వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే డేంజర్ ప్లేయర్లను మరోసారి రిటైన్ చేసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad). అలాగే గతంలో ప్రదర్శన సరిగ్గా చేయని వాళ్లను వదిలేసింది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సారి రిటైన్ చేసుకున్న ప్లేయర్ల లిస్టును ఒకసారి పరిశీలిస్తే, అభిషేక్ శర్మ, డేంజర్ ఆటగాడు ఇశాన్ కిషన్, సిక్సర్ల వీరుడు అనికేత్ వర్మ, జయదేవ్ ఉన‌ద్క‌త్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్లను మరోసారి రిటైన్ చేసుకుంది. స్వదేశీ ప్లేయర్ అయిన హర్షల్ పటేల్, హర్ష దుబే, జేషన్ అన్సారి ఇలాంటి ప్లేయర్లను రిటైన్ చేసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. ఇక ఇంగ్లాండ్ ఆల్రౌండర్ కార్సే, ట్రావిస్ హెడ్, మలింగ, కమిండు మెండిస్, ప్యాట్ కమిన్స్, కాటేరమ్మ కొడుకు హేన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen ) లాంటి విదేశీ ప్లేయర్లను తిరిగి రిటైన్ చేసుకుంది కావ్య పాప.

ఐపీఎల్ 2026 టోర్నమెంట్..హైద‌రాబాద్‌ వదిలేసిన ప్లేయర్లు వీళ్లే

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం కొంతమంది ప్లేయర్లను వదిలేసింది. ఆ లిస్టులో అభినవ్ మనోహర్, అతర్వ, సచిన్ బేబీ, వ్యాన్ మల్డర్, సిమర్జిత్ సింగ్, రాహుల్ చాహార్, అడం జంపా, మహమ్మద్ షమీ లాంటి ప్లేయర్లను వదిలేసుకుంది హైదరాబాద్ యాజమాన్యం. అయితే మహమ్మద్ షమీని ట్రేడ్ ప్రక్రియ ద్వారా లక్నో కొనుగోలు చేసింది. అతనికి ఏకంగా 10 కోట్లు ఇచ్చి మరి కొనుగోలు చేసింది లక్నో యాజమాన్యం. ఇక ప్లేయర్లను రిటైన్ అలాగే రిలీజ్ చేయగా 25.50 కోట్లతో మినీ వేలంలో బరిలోకి దిగనుంది హైదరాబాద్.

Advertisement

Also Read: Vaibhav Suryavanshi: వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ,20 ఓవ‌ర్ల‌లో 297 ప‌రుగులు, SRH రికార్డ్ బ‌ద్ద‌లు

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×