Bigg Boss 9 Telugu : ఎక్స్పెక్ట్ ది అన్ ఎక్స్పెక్ట్ ట్విస్ట్… ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడితే ఏమైనా జరగొచ్చు. మొదటి వారమే లేదా మిడ్ వీక్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్, అందరూ కలిసి కార్నర్ చేయడం అన్నది ఇక్కడ కామన్. షో టీఆర్పీని పెంచడానికి బిగ్ బాస్ అంతకుమించి ప్లాన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా సంజన విషయంలో అదే జరిగింది. బిగ్ బాస్ ఏదో గేమ్ పై ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ పెంచుదామని చిన్న ట్విస్ట్ ఇస్తే… సంజనా ఏకంగా తనను ఇంటికి పంపకపోతే చచ్చిపోతానని వార్నింగ్ ఇచ్చి బిగ్ బాస్ కే షాక్ ఇచ్చింది.
శనివారం ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ కి క్లాస్ పీకే కార్యక్రమం పూర్తి కాగానే, ఇంటి సభ్యులకు ఓ టాస్క్ పెట్టారు. అందులో భాగంగా ఈ హౌస్ లో తమ ఆటను ముంచేది ఎవరు? తేల్చేది ఎవరు? అనేది ఒక్కొక్కరిగా చెప్పామన్నారు. ఇమ్మాన్యుయేల్ ఒక్కడే సంజన తన సపోర్ట్ అని చెప్పాడు. మిగతా వాళ్లలో చాలామంది వివిధ కారణాల వల్ల సంజన ముంచేది అని తేల్చారు. అంతకు ముందే నాగార్జున ఆమెకు రీతూను ఆఫ్ట్రాల్ అన్నందుకు ఫైర్ అయ్యారు. ఇదివరకు కూడా సంజన చాలాసార్లు నోరు జారింది. అలాగే ఫుడ్ దొంగతనం విషయంలో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఇవన్నీ కలగలిసి ఈరోజు నాగార్జున నుంచి సీరియస్ వార్నింగ్ రావడంతో పాటు, హౌస్ మేట్స్ అందరూ కలిసి సంజన ముంచేస్తుందని తేల్చడంతో బిగ్ బాంబు ఆమెపై పడింది. దాని ఫలితమే సంజనకు ఫ్యామిలీ వీక్ కట్. నాగ్ నోటి నుంచి ఈ మాట వచ్చిందో లేదో సంజన ఏడుస్తూ “నేను ఉండలేను సార్… చచ్చిపోతా… ప్రతిరోజూ నేను లోపల 6 సార్ల, బయట 3 సార్లు ఏడుస్తున్నాను. హౌస్ లో ఎవరికీ అంత చెడు చేయలేదు నేను ఫ్యామిలీ వీక్ లేకపోతే నావల్ల కాదు. షో మీద మీ మీద నాకు నాపైన కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. కానీ నేను ఇంటికెళ్ళిపోతా పంపించండి. దానికంటే ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను” అంటూ వెక్కివెక్కి ఏడ్చింది.
ఆ బిగ్ ట్విస్ట్ ఇదే
సంజన ఏడుపు చూసి హౌస్ మేట్స్ అందరూ బిక్కముఖం వేశారు. కళ్యాణ్, భరణి తమ ఫ్యామిలీ వీక్స్ ను శాక్రిఫైజ్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ నాగ్ అందుకు ఒప్పుకోలేదు. ఆమె కోసం ఏమేం శాక్రిఫైజ్ చేయాలో అవన్నీ చేశారు. ఇప్పుడు త్యాగాలు చేస్తే ఆమెకు ఫ్యామిలీ వీక్ ఇస్తానని బిగ్ బాస్ చెప్పలేదు. ఏం చేయాలో బిగ్ బాస్ చెప్తారు. కామ్ డౌన్ సంజన” అంటూ అందరినీ కూర్చోపెట్టారు. దీంతో ఎలిమినేషన్ రౌండ్ లో కూడా తాను ఎలిమినేషన్ కాకపోవడంతో నేను రెడీగా ఉన్నా కదా బయటకు వెళ్ళడానికి అంటూ నిఖిల్ కి చెప్పి ఏడ్చింది. అయితే బిగ్ బాస్ చివర్లో సంజన ఫ్యామిలీని కూడా హౌస్ లోకి పంపబోతున్నారని సమాచారం.
Read Also : కిట్టి పార్టీలో ఖిలాడీ లేడీస్… కితకితలు పెట్టే పంజాబీ క్రైమ్ కామెడీ డ్రామా