BigTV English
Advertisement

IPL 2026: RCBకి కోహ్లీ వెన్నుపోటు…కొంచెం కూడా మ‌న‌వ‌త్వం లేదా?

IPL 2026: RCBకి కోహ్లీ వెన్నుపోటు…కొంచెం కూడా మ‌న‌వ‌త్వం లేదా?

IPL 2026:  ఇండియ‌న్ ప్రీమియ‌ర్ 2026 టోర్న‌మెంట్ ( Indian Premier 2026 Tournament ) నేప‌థ్యంలో 10 జ‌ట్ల‌లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 15వ తేదీన జరగనుంది.,న‌వంబ‌ర్ 15వ తేదీ లోపు ఏ ఏ ప్లేయ‌ర్ల‌ను వ‌దిలేసేది చెప్పాల‌ని బీసీసీఐ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే 10 ఫ్రాంచైజీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఏ ప్లేయర్ ను వదిలివేయాలి ? ఎవరిని అంటిపెట్టుకొని ఉండాలి ? అనే దానిపై ఫోకస్ చేస్తున్నాయి 10 ఫ్రాంచైజీలు. అయితే ఇలాంటి నేపథ్యంలో రాయల్ ఛాలెంజ‌ర్స్‌ బెంగళూరు జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) జట్టుకు వెన్నుపోటు పొడిచి, ఢిల్లీ క్యాపిటల్స్ లోకి వెళ్లేందుకు విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకున్నాడట. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


Also Read: Womens World Cup 2025: 1973 నుంచి వ‌ర‌ల్డ్ క‌ప్‌ టైటిల్ గెలిచిన జ‌ట్లు ఇవే..టీమిండియా ఒక్క‌టి కూడా లేదా ?

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరుకు షాక్.. ఢిల్లీలోకి విరాట్ కోహ్లీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు దాదాపు 18 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. వచ్చే సీజన్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు జ‌ట్టుకు కాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals) జట్టుకు ఆడేందుకు నిర్ణయం తీసుకున్నాడట. ఈ మేరకు ట్రేడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్న కేఎల్ రాహుల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వెళ్తాడని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ సొంత నగరం ఢిల్లీ. అందుకే తన రిటైర్మెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ లోనే ఇవ్వాలని అనుకుంటున్నాడట. అందుకే కేఎల్ రాహుల్ ను బెంగళూరుకు పంపించి ఢిల్లీలోకి తాను వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ పై ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ( Virat Kohli) సైన్ చేయలేదని సమాచారం.


విరాట్ కోహ్లీ పై RCB అభిమానులు సీరియస్

18 సంవత్సరాల పాటు విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టులో కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో విరాట్ కోహ్లీకి అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. ఏ ప్లేయర్ కు లేనంత ఫాలోయింగ్ వచ్చింది. విరాట్ కోహ్లీ అంటేనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్న రేంజ్ కు చేరింది. అయితే అలాంటి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును గత ఏడాది ఛాంపియన్ గా నిలిపాడు విరాట్ కోహ్లీ. అతని కెప్టెన్సీలో కాకపోయినా… ఆయన ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా బెంగళూరు ఛాంపియన్ అయిందని అభిమానులు భావిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ అభిమానులను కాదని, ఢిల్లీ క్యాపిటల్స్ లో రిటైర్మెంట్ ఇస్తే తాము ఊరుకునేది లేదని ఫైర్ అవుతున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు. కోహ్లీ రిటైర్మెంట్ బెంగళూరు తరఫున ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై విరాట్ కోహ్లీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Also Read: Gambhir: గంభీర్‌ ఓ చీడ పురుగు.. బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చ‌డంపై ట్రోలింగ్‌, హ‌ర్షిత్ రాణాను ఓపెన‌ర్ గా దించుకో!

 

Related News

Gautam Gambhir: ఓరేయ్ గంభీరా…ఏంట్రా ఇది, గ‌ల్లీ పోర‌గాళ్ల ఆట కంటే దారుణం…?

Washington Sundar: ఒకేసారి ఇద్దరితో డేటింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ ?

Womens World Cup 2025: టీమిండియాకు రూ.125 కోట్ల ఆఫ‌ర్‌..?ఐసీసీ కంటే 3 రేట్లు ఎక్కువే

Smriti mandhana: జమీమా సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్న స్మృతి మందాన.. టీమిండియాలో అంతర్యుద్ధం ?

Australia: ఆ ఒక్క త‌ప్పిదం… ఆస్ట్రేలియాకు చుట్టుకున్న ద‌రిద్రం.. ఇక అనుభ‌వించాల్సిందే

Kasturi -Jemimah: జెమిమా రోడ్రిగ్స్ పై న‌టి కస్తూరి సీరియ‌స్‌.. నీకు మెడ మీద త‌ల‌కాయ ఉందా?

Team India: మోడీ సార్… గంభీర్, అగర్కార్ ను మీరైనా తీసేయండి.. టీమ్ ఇండియాను కాపాడండి!

Big Stories

×