 
					Womens World Cup 2025: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ దశకు వచ్చేసింది. ఈ మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికా అలాగే టీమిండియా తలపడనున్నాయి. ముంబై వేదికగా ఈ మ్యాచ్ నవంబర్ 2వ తేదీన నిర్వహించనున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ ఇప్పటి వరకు గెలిచిన జట్ల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ లిస్టులో టీమిండియాతో దక్షిణాఫ్రికా లేనేలేవు. 1973 నుంచి ఇప్పటి వరకు వరల్డ్ కప్ నిర్వహిస్తున్న నేపథ్యంలో… ఒక్కసారి కూడా టీమిండియా చాంపియన్ గా నిలవలేదు.
మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ 1973 నుంచి నిర్వహిస్తున్నారు. అలా 12 సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ కొనసాగుతోంది. అయితే ఈ 1973 నుంచి ఇప్పటి వరకు టీమిండియా అలాగే ఫైనల్ కు చేరిన దక్షిణాఫ్రికా టైటిల్ గెలవలేకపోయాయి. ఫైనల్ దాకా టీమిండియా రెండుసార్లు వెళ్లి ఓడిపోయింది. అయితే ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఏడు సార్లు విజయం సాధించింది. మొన్న 2022లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కూడా 7 సార్లు ఛాంపియన్ గా ఆస్ట్రేలియా నిలిచింది. అంత భయంకరమైన జట్టును నిన్న రెండో సెమీ ఫైనల్ లో టీమిండియా ఓడించింది. అటు ఇంగ్లాండ్ ఇప్పటి వరకు నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. న్యూజిలాండ్ ఒకే ఒక్కసారి టైటిల్ గెలవడం జరిగింది.
2025 మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం. 1973 నుంచి చూసుకున్నట్లయితే ఈ రెండు జట్లు ఎక్కడ కూడా టైటిల్ నెగ్గలేదు. మొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఫైట్ జరిగినట్లుగానే ఇప్పుడు దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఏ జట్టు గెలిచినా సరికొత్త చరిత్ర అవుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం టీమ్ ఇండియాకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. హోమ్ గ్రౌండ్ కావడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. అలాగే ఐసీసీ లాంటి కీలక ఈవెంట్లలో దక్షిణాఫ్రికా డీలా పడిపోవడం కూడా టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. మరి ఫైనల్ లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ సమయంలో వర్షం పడితే రిజర్వ్ డే ఉంటుంది. అయితే రిజర్వ్ డే కూడా రద్దు అయితే, దక్షిణాఫ్రికా గెలిచే ప్రమాదం ఉంటుంది. పాయింట్ల పట్టిక ప్రకారం మెరుగ్గా ఉన్న దక్షిణాఫ్రికా గెలుస్తుంది.
Also Read: SHREYAS IYER: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్.. కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే
Women’s ODI World Cup champions 🏆
1973: England
1978: Australia
1982: Australia
1988: Australia
1993: England
1997: Australia
2000: New Zealand
2005: Australia
2009: England
2013: Australia
2017: England
2022: Australia
𝟮𝟬𝟮𝟱: 𝗦𝗼𝘂𝘁𝗵 𝗔𝗳𝗿𝗶𝗰𝗮 𝗼𝗿 𝗜𝗻𝗱𝗶𝗮 🇿🇦 🇮🇳 pic.twitter.com/1k0QOc1Kih— ESPNcricinfo (@ESPNcricinfo) October 30, 2025