 
					Gambhir: 5 టి-20 ల సిరీస్ లో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా నేడు రెండవ టి-20 మ్యాచ్ జరిగింది. ఈ టి-20 లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ కి దిగిన భారత్ .. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి వరుసగా వికెట్స్ కోల్పోయింది. మూడవ ఓవర్ లోనే టీమ్ ఇండియాకి షాక్ తగిలింది. గత మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన వైస్ కెప్టెన్ గిల్ కేవలం ఐదు పరుగులకే అవుట్ అయ్యాడు.
Also Read: Jemimah: ధోని బ్యాట్ కంటే, నా బ్యాట్ బరువే ఎక్కువ.. జెమిమా కామెంట్స్ వైరల్
హెజిల్ వుడ్ బౌలింగ్ లో మిచెల్ మార్ష్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 20 పరుగుల వద్ద భారత్ తన తొలి వికెట్ ని కోల్పోయింది. ఇక నాలుగో ఓవర్ లో భారత జట్టుకు మళ్ళీ షాక్ తగిలింది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన సంజు శాంసన్.. కేవలం రెండు పరుగులు చేసి విఫలమయ్యాడు. ఆ తరువాత సూర్య కుమార్ యాదవ్ {1}, ఆ వెంటనే తిలక్ వర్మ {0} డకౌట్ అయ్యాడు.
ఓవైపు వికెట్లు పడుతున్నా.. ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం తనదైన శైలిలో ఆస్ట్రేలియా బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే హఫ్ సెంచరీ బాదేశాడు. ఇక హర్షిత్ రానా – అభిషేక్ శర్మ కలిసి ఓ మోస్తరు భాగస్వామ్యాన్ని నెల కోల్పోయారు. ఆ తరువాత అక్షర్ పటేల్ {7}, దూబే {4}, కుల్దీప్ యాదవ్, బూమ్రా డకౌట్ అయ్యారు. ఈ క్రమంలో 18.4 ఓవర్లలో భారత జట్టు 125 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హెజిల్ వుడ్ 3, బర్ట్లెట్ 2, ఎల్లీస్ 2, స్టోయినీస్ 1 వికెట్లు పడగొట్టారు.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ చిలిపి పనులు.. తోటి ప్లేయర్ పై పడుకొని మరి.. కామాంధుడు అంటూ ట్రోలింగ్!
అనంతరం 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు.. భారత బౌలర్ల పై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్లతో టీమిండియా ఫాస్ట్ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ట్రావీస్ హెడ్ 28, మిచెల్ మార్ష్ 46 పరుగులు చేసిన తర్వాత.. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దించాడు. ఈ క్రమంలో నాలుగవ ఓవర్ 3వ బంతికి ట్రవిస్ హెడ్ వికెట్ పడగొట్టాడు వరుణ్ చక్రవర్తి. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఇంగ్లిస్ {20}, టీమ్ డేవిడ్ {1}, ఒవెన్ {14}, షార్ట్ {0}, స్టోయినీస్ {6} పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టును గెలిపించారు. ఈ క్రమంలో 13.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
నేడు జరిగిన రెండవ టి-20లో బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై మరోసారి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు క్రీడాభిమానులు. సంజూ శాంసన్ ని ఫస్ట్ డౌన్ లో దించడం.. సూర్య కుమార్ యాదవ్ ని నాలుగవ స్థానంలో పంపించడం, శివం దూబేని పక్కన పెట్టి.. హర్షిత్ రానా ని ముందుగా బ్యాటింగ్ కి పంపించాడని.. ఇలా కన్ఫ్యూజ్ చేసి భారత ఓటమికి గౌతమ్ గంభీర్ కారణమయ్యాడని మండిపడుతున్నారు. ఇక హర్షిత్ రానా ని ఓపెనర్ గా దించుకో..? అంటూ ఓ అభిమాని సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడ్డాడు. హర్షిత్ రానా.. అభిషేక్ శర్మకి బ్యాటింగ్ ఇవ్వకుండా.. చాలా బంతులు వృధా చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులతో గంభీర్ మరోసారి ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నాడు.