OTT Movie : రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. ఇది ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి దిగ్గజ నటుల సినిమాలు బాక్సాఫీస్ లో సాధించని కలెక్షన్లను కాంతార 2 హిందీ వెర్షన్ మాత్రమే రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా మొత్తానికి 850 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది. ఓటీటీలో కూడా టాప్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది. అయితే అన్ని భాషల్లో ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా, హిందీ వెర్షన్ ఆలస్యంగా రిలీజ్ చేస్తోంది. దీనికి గల కారణాలను తెలుసుకుందాం పదండి.
‘కాంతార చాప్టర్ 1’ (Kanthara chapter 1) రిషబ్ శెట్టి , జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య నటించిన ఈ సినిమా 2025 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. నెల తిరక్కుండానే అక్టోబర్ 31న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. దీని డిజిటల్ రైట్స్ కోసం ప్రైమ్ వీడియో భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కావడంతో ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. ఈ ఇతిహాస పౌరాణిక యాక్షన్ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే హిందీ వెర్షన్ ఆలస్యంగా వస్తుండటంతో అభిమానుల్లో కొంచెం నిరాశ కలుగుతోంది.
Read Also : పీడకలగా మారే సైకో ఫ్యామిలీ మర్యాద… అతిథులను ఆహ్వానించి అన్నీ విప్పించి… మస్ట్ వాచ్ సైకలాజికల్ థ్రిల్లర్
ప్రైమ్ వీడియోలో కాంతార చాప్టర్ 1 హిందీ వెర్షన్‌ను చూడటానికి చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మిగతా భాషల్లో వచ్చి, హిందీలో రాకపోవడంతో అభిమానులు చింతిస్తున్నారు. ఈ సినిమా దక్షిణ భాషలలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉన్నప్పటికీ, హిందీ వెర్షన్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి నాలుగు వారాల గడువు ముగిసిన తర్వాత సౌత్ సినిమాలు స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటాయి కాబట్టి, ‘కాంతారా: ఎ లెజెండ్ చాప్టర్ 1’ అక్టోబర్ 31న ఆన్‌లైన్‌లో విడుదలైంది. హిందీ సినిమాలు సాధారణంగా ఎనిమిది వారాల థియేటర్ గడువు పూర్తయిన తర్వాత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ ప్రీమియర్‌ను కలిగి ఉంటాయి. అందువల్ల ‘కాంతార చాప్టర్ 1’ నవంబర్ 27న ప్రైమ్ వీడియోలో హిందీ వర్షన్ లో వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగానే హిందీ వెర్షన్ ఆలస్యం అవుతోంది.