E-Paper
Advertisement

IPL Auction 2026: కామెరాన్ గ్రీన్ కు BCCI బిగ్ షాక్‌.. రూ. 25.20 కోట్లలో కోత‌, ఏకంగా రూ.7.20 కోట్లు రిట‌ర్న్‌ !

IPL Auction 2026:  కామెరాన్ గ్రీన్ కు BCCI బిగ్ షాక్‌.. రూ. 25.20 కోట్లలో కోత‌, ఏకంగా రూ.7.20 కోట్లు రిట‌ర్న్‌ !
Advertisement

IPL Auction 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League 2026 Tournament ) సంబంధించిన మినీ వేలం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ మినీ వేలంలో విదేశీ ఆటగాడు కామెరాన్ గ్రీన్ పై కోట్ల వర్షం కురిసింది. 25.20 కోట్లకు కామెరాన్ గ్రీన్ ను కేకేఆర్ జట్టు కొనుగోలు చేసింది. రెండు కోట్ల బేస్ ప్రైస్ తో ఫస్ట్ స్టేజ్ లో వేలంలోకి వచ్చాడు కామెరాన్ గ్రీన్. ఈ నేపథ్యంలోనే అతని కొనుగోలు చేసేందుకు కేకేఆర్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ బాగా పోటీ పడ్డాయి. కానీ చివరికి కామెరాన్ గ్రీన్ ను రూ. 25.20 కోట్లకు దక్కించుకుంది కేకేఆర్. విదేశీ ప్లేయర్ కు ఈ స్థాయిలో ఎక్కువ ధర రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో మిచెల్ స్టార్క్ 24.75 కోట్లు పలికాడు. అయితే ఇప్పుడు అతని రికార్డు కామెరాన్ గ్రీన్ బద్దలు కొట్టాడు.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

కామెరాన్ గ్రీన్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఐపీఎల్ కొత్త రూల్స్

Advertisement

ఐపీఎల్ మినీ వేలం 2026 టోర్నమెంటులో ( Indian Premier League 2026 Tournament ) భారీ ధర పలికిన ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అతడు దక్కించుకున్న 25.20 కోట్లలో కోత విధించనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఐపీఎల్ కొత్త రూల్స్ ప్రకారం 18 కోట్ల కంటే ఎక్కువ విదేశీ ప్లేయర్ పలికితే, 18 కోట్ల పైన ఉన్న డబ్బు మొత్తం బీసీసీఐ ప్లేయర్ల వెల్ఫేర్ కోసం ఖర్చు చేయనుంది. దీంతో గ్రీన్ పలికిన ధరలో 7.20 కోట్లు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అతనికి కేవలం 18 కోట్లు మాత్రమే దక్కుతాయి. కామెరాన్ గ్రీన్ రూ. 25.20లో కోత విధిస్తార‌న్న మాట‌. ఈ రూల్ విదేశీ ప్లేయర్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు

రిషబ్ పంత్ – 27 కోట్లు.
శ్రేయాస్ అయ్యర్ – 26.75 కోట్లు.
కామెరాన్ గ్రీన్ – 25.20 కోట్లు.
మిచెల్ స్టార్క్ – 24.75 కోట్లు.
వెంకటేష్ అయ్యర్ – 23.75 కోట్లు.

Advertisement

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×