E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ బిడ్డ   

Nindu Noorella Saavasam Serial Today December 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ బిడ్డ   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

అడవిలో ఉన్న గుడిలో మిస్సమ్మకు డెలివరీ అవుతుంది. అయితే పుట్టిన బిడ్డ కదలకపోవడంతో అందరూ టెన్షన్‌ పడుతుంటారు. ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకున్న చంభా పట్టుకుని చూస్తుంది. బిడ్డ ఏడవడం లేదు.. కదలడం లేదు.. చనిపోయిందా ఏంటి…? అని మనసులో అనుకుంటుంది. వెంటనే ఆ బిడ్డను అటూ ఇటూ కదలిస్తుంది. అయినా ఆ బిడ్డ కదలదు.. దీంతో చంభా బిడ్డ కదలడం లేదు.. చనిపోయినట్టు ఉంది అని చెప్తుంది. చంభా మాటలకు అమర్‌, రామ్మూర్తి, పిల్లలు షాక్‌ అవుతారు. మనోహరి మాత్రం ఎవ్వరికీ కనిపించకుండా నవ్వుకుంటుంది. అమర్‌ దగ్గరకు వచ్చి బిడ్డను పట్టుకుని చూసి ఏడుస్తుంటాడు. నిర్జీవంగా పడి ఉన్న బిడ్డను చూసిన రామ్మూర్తి ఎమెషనల్‌ అవుతాడు. బాధ తట్టుకోలేక గుడిలో గంటను కంటిన్యూగా కొడుతుంటాడు.

బిడ్డ చనిపోయిందని అమర్‌ పిల్లలు కూడా ఏడుస్తుంటారు. అక్కడంతా వాళ్ల ఏడుపులతో రోదనగా మారుతుంది. అక్కడే ఉండి చూస్తున్న ఆరు ఏడుస్తుంది. నేను ముందే చెప్పాను కదా బాలిక ఈ రోదన చూడటానికే నువ్వు ఇక్కడ ఉన్నావా..? నీ వాళ్ల బాధను చూడటానికే నువ్వు ఇక్కడి దాకా వచ్చావా..? అంటాడు.. దీంతో ఆరు లేదు గుప్త  గారు ఏదో ఒకటి చేయాలి.. నా వాళ్ల బాధను నేను చూడలేకపోతున్నాను.. ఏదో ఒకటి చేయాలి గుప్త గారు అంటుంది. ఏం చేస్తావు బాలిక.. విధిరాతను మారుస్తావా..? అయినా అంత శక్తి నీకుందా బాలిక.. అని చెప్పగానే… నాకు అంత శక్తి లేకపోవచ్చు గుప్త గారు కానీ నేను నా ప్రయత్నం చేస్తాను అంటూ గుప్త ఇచ్చిన రింగ్‌ పట్టుకుని ధూం థథ అంటుంది ఆరు. ఆ మంత్ర చదివిన వెంటనే ఆరు ఆత్మ ఆ బిడ్డలోకి ప్రవేశిస్తుంది. ఆరు ఆత్మ బిడ్డలోకి వెళ్లడం చూసి గుప్త షాక్‌ అవుతాడు. ఆరు బిడ్డలోకి ప్రవేశించగానే.. బిడ్డ ఏడుస్తుంది. ఆ బిడ్డ ఏడుపు విని అందరూ షాక్‌ అవుతారు. అమర్‌, రామ్మూర్తి, పిల్లలు హ్యాపీగా ఫీలయితే.. మనోహరి మాత్రం షాక్‌లోనే ఉండిపోతుంది. అందరూ హ్యాపీగా ఉంటారు.

Advertisement

తర్వాత కట్‌ చేస్తే.. గుప్త.. ఆరు చేసిన పనికి తల పట్టుకుని కూర్చుంటాడు. ఇంతలో యముడు వచ్చి గుప్తను తిట్టి వెళ్లిపోతాడు. ఇక అమర్ వాళ్లు మిస్సమ్మను హాస్పిటల్‌లో జాయిన్‌ చేసి ఉంటారు. డాక్టర్‌, అమర్‌ దగ్గరకు వచ్చి తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నారని సాయంత్రం డిశ్చార్జ్‌ చేస్తాం అని చెప్పి వెళ్లిపోతుంది. అమర్‌ థాంక్యూ డాక్టర్‌ అంటూ రాథోడ్‌ను పిలిచి సాయంత్రం డిశ్చార్జ్‌ చేస్తారట.. ఆ ఏర్పాట్లు చూడమని చెప్తాడు రాథోడ్‌ సరే సార్‌ అంటూ వెళ్లిపోతాడు.

తర్వాత సాయంత్రం అందరూ మిస్సమ్మను బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్తారు. అప్పటికే ఇంట్లో ఉన్న మంగళ దిష్టి తీయడానికి దీపం తీసుకుని వస్తే.. రామ్మూర్తి కోపంగా మంగళను తిడతాడు.. నువ్వు కాదు దిష్టి తీయాల్సింది అంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. మరి ఎవరు తీయాలి మామయ్య అని అమర్‌ అడగ్గానే.. మనోహరి తీయాలి.. ఎందుకంటే తన ప్రాణ స్నేహితురాలు మళ్ళీ పుట్టి వచ్చింది కదా అందుకే మనోహరే తనకు దిష్టి తీయాలి అని చెప్తాడు రామ్మూర్తి. మనోహరి అఇష్టంగానే.. దిష్టి తీసి మిస్సమ్మకు బేబికి బొట్టు పెడుతుంది. బేబి నుదుట బొట్టు పెట్టగానే.. మనోహరికి కరెంట్‌ షాక్‌ తగిలినట్టు అవుతుంది. వెంటనే ఉలిక్కిపడుతుంది మనోహరి. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×