E-Paper
Advertisement

IPL VS PSL: బీసీసీఐకి ఘోర అవ‌మానం..ఆ ర్యాంకింగ్స్ లో IPLను దాటేసిన‌ PSL !

IPL VS PSL: బీసీసీఐకి ఘోర అవ‌మానం..ఆ ర్యాంకింగ్స్ లో IPLను దాటేసిన‌ PSL !

IPL VS PSL:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ అంటే మరో 8 రోజుల్లో మాత్రమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షురూ అవుతుంది. అటు పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Pakistan Super League) మరో ఆరు రోజుల్లోనే ప్రారంభం కానుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా ప్రపంచ క్రికెటర్ల సంఘం ( World Cricketers Association ) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ దిగజారింది. ప్ర‌పంచంలో జ‌నాధార‌ణ‌ ఉన్న ఫ్రాంచైజీ లీగ్స్ ర్యాంకింగ్స్ లో ధనిక టోర్నమెంట్ అయిన ఐపీఎల్ కు మూడో స్థానం దక్కగా, మొదటి స్థానంలో ది హండ్రెడ్ లీగ్ నిలిచింది. అటు వివాదాలను పరిష్కరించే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ సూపర్ లీగ్ నాలుగో స్థానంలో నిలువగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదవ స్థానానికి పడిపోయింది. దీంతో ఐపీఎల్ టోర్న‌మెంట్ ను పాకిస్తాన్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read: Kavya Maran: దేశ ద్రోహి అంటూ కావ్య పాప‌ను ట్రోల్ చేస్తున్నారు, కానీ క‌రోనా, తుఫాన్లు వ‌చ్చిన‌ప్పుడు ఇండియాను ఆదుకున్న దేవ‌త !

టాప్ 10 క్రికెట్ లీగ్‌లలో ఐపీఎల్ కు 3వ స్థానం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీ లీగ్స్ పైన అధ్యయనం చేసిన ప్రపంచ క్రికెటర్ల సంఘం ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు మూడో స్థానం దక్కింది. మొదటి స్థానంలో ఇంగ్లాండ్ నిర్వహిస్తున్న ది హండ్రెడ్ లీగ్ నిలిచింది. ఈ టోర్నమెంట్ కు 75.2 పాయింట్లు ఇచ్చిన వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్.. మొదటి స్థానం కల్పించింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ కు 68 పాయింట్లు దక్కించుకొని రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు 62.6 పాయింట్లు మాత్రమే వచ్చాయి. ధనిక లీగ్ అయినప్పటికీ ఐపీఎల్ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బిగ్ బాష్ లీగ్ నాలుగో స్థానంలో నిలువగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 5వ స్థానంలో నిలిచింది. ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటుకు 48 పాయింట్లు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా జనాధారణ, ఇతర అంశాల నేపథ్యంలో ఈ ర్యాంకింగ్స్ ప్రకటించింది వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్.

ఆటగాళ్ల గొడవలు, హక్కుల ర్యాంకింగ్స్ లో PSL దూకుడు ?

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజీ టోర్నమెంట్లలో ఆటగాళ్లకు గొడవలు, ప్లేయర్లకు హక్కులు కల్పించిన ర్యాంకింగ్స్ లో ఐపిఎల్ టోర్నమెంటును దాటేసింది పాకిస్తాన్ సూపర్ లీ. ఈ ర్యాంకింగ్స్ లో ఎప్పటిలాగే ది హండ్రెడ్ మొదటి స్థానంలో ఉండగా, సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ రెండో స్థానంలో నిలిచింది. బిగ్ బాష్ లీగ్ మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ నాలుగో స్థానంలో ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఐదవ స్థానంలో నిలవడం జరిగింది. అన్ని టోర్నమెంట్ల కంటే ఐపీఎల్లో ఫ్రాంచైజీలకు ఫుల్ పవర్స్ ఉన్న నేపథ్యంలో, ప్లేయర్లు ఎలాంటి డిమాండ్ చేసిన పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం డబ్బులు చుట్టే ఐపిఎల్ నడుస్తూ ఉంటుంది. అందుకే పాకిస్తాన్ కంటే ఐపిఎల్ వెనుకబడిందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

 

 

Also Read: Inzamam-ul-Haq: అల్లా మీద ఒట్టు..ఇకపై టీమిండియాకు ఒక్క ట్రోఫీ రాదు, పాకిస్తానే వరుసగా 5 వరల్డ్ కప్ లు గెలుస్తుంది

 

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×