E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్ సీరియస్ కండీషన్ – అయోమయంలో అపర్ణ, ఇందు  

Brahmamudi Serial Today march 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్ సీరియస్ కండీషన్ – అయోమయంలో అపర్ణ, ఇందు  
Advertisement

Brahmamudi serial today Episode:  అపర్ణ వెళ్లి గుడిలో లాయరును కలుస్తుంది. లాయరుతో ఆస్తి వివరాలు రేఖ చేసిన బలవంతపు దౌర్జన్యాలు చెప్తుంది. దీంతో లాయరు అది పూర్తిగా ఇల్లీగల్‌ మేడం మీరు ఎందుకు ఊరికే ఉన్నారు అని అడగ్గానే.. అప్పుడున్న పరిస్థితులకు అలా ఉండాల్సి వచ్చింది. 22 ఏళ్లుగా మా ఖర్చుల కోసం కంపెనీ నుంచి ప్రతి నెలా వస్తున్న డబ్బు మొత్తం ఆ రేఖే తీసుకుంటుంది. దాని వల్ల నా మనవరాళ్లకు అన్యాయం జరుగుతుంది అని అపర్ణ చెప్పగానే.. లాయరు ఇది ఇంకా పెద్ద తప్పు మేడం.. మీరు కానీ కోర్టుకు వెళ్లితే ఇన్నేళ్లుగా మీకు రాకుండా వాళ్లు దోచుకున్న డబ్బు వడ్డీతో సహా మీకు కట్టాలని కోర్డు ఆర్డర్‌ ఇస్తుంది అని చెప్పగానే.. దీంతో అపర్ణ లాయరు గారు వాళ్లు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నా మనవరాలు మేజర్‌ కాబట్టి తన పేరు మీదకు ఆస్థి మొత్తం ట్రాన్స్‌ఫర్‌ అయ్యే వరకు పవరాఫ్‌ పటార్ని కూడా నా మనవరాలికి వచ్చేలాగా కోర్టులో కేసు వేయండి.. అని చెప్పగానే..

లాయరు ఇది చాలా చిన్న కేసు మేడం రేఖ గారు ఎంత ట్రై చేసినా కేసులో నిలవలేరు. వాళ్లు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తారు. ఇందులో తప్పకుండా మీరే గెలుస్తారు అని చెప్పగానే.. అపర్ణ నాకు ఇప్పుడు కావాల్సింది గెలుపు ఓటములు కాదు లాయరు గారు.. న్యాయం.. ఇన్నేళ్లుగా నా మనవరాలికి జరుగుతున్న అన్యాయానికి ఇప్పుడే న్యాయం కావాలి. అని చెప్పగానే.. లాయరు తప్పకుండా మేడం ఇవాళే ఆ రేఖ గారి మీద కేసు వేస్తాను.. తన పేరు మీద ఉన్న పవార్‌ పటార్ని ఇందు గారి పేరు మీదకు వచ్చేలా చేస్తాను.. అని చెప్పగానే.. అపర్ణ థాంక్యూ  లాయరు గారు కానీ ఒక్క ముఖ్యమైన విషయం అనగానే.. లాయరు ఏంటి మేడం… అని అడగ్గానే.. అపర్ణ కోర్టులో ఈ కేసు మాకు అనుకూలంగా వచ్చే వరకు ఈ విషయం బయటకు రాకూడదు.. ముఖ్యంగా ఆ రేఖకు ఈ విషయం తెలియకూడదు.. అని రిక్వెస్ట్‌ చేయగానే..

Advertisement

లాయరు నాకు తెలుసు మేడం వాళ్లకు ఈ విషయం తెలిస్తే.. వాళ్లు ఏదో విధంగా జాగ్రత్త పడతారు అని చెప్తాడు. దీంతో అపర్ణ ఆరోజు అన్యాయంగా నాచేత ఎలా సంతకం పెట్టించుకుందో వాటికి సంబంధఙంచిన డాక్యెమెంట్స్‌ ఇందులో ఉన్నాయి అంటూ ఇస్తుంది. దీంతో లాయరు.. మేడం ఈ విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అని చెప్పగానే.. ఇప్పుడున్న పరిస్తితుల్లో నేన మీకు ఫీజు రూపంలో డబ్బులు ఇవ్వలేను అందుకే వీటి రూపంలో ఇస్తున్నాను.. అంటూ నగలు ఇస్తుంది అపర్ణ దీంతో లాయరు మేడం ఏంటి మేడం ఇది అంటాడు. దీంతో ఇలా ఇస్తున్నానని మీరు ఇబ్బంది పడకండి నా మనవరాలికి న్యాయం జరిగితే అంతే చాలు ఆలోచించకండి లాయరు గారు ఫ్లీజ్‌ తీసుకోండి.. అని చెప్పగగానే.. లాయరు తీసుకుని మీరేం కంగారు పడకండి మేడం అంతా నేను చూసుకుంటాను.. వస్తాను మేడం అంటూ వెళ్లిపోతాడు.

మరోవైపు ఇందు ఇంటర్య్యూకు లేటుగా వెళ్తుంది. అక్కడ అప్పటికే ఇంటర్వ్యూలు అయిపోయాయని చెప్తారు. బలవంతంగా ఇందు హెచ్ఆర్‌ దగ్గరకు వెళ్తుంది. తన లేటుకు కారణం ఫోన్‌ పగిలిపోయినందు వల్ల లేట్‌ అయిందని చెప్తుంది. హెచ్‌ఆర్‌ నమ్మడు.. జాబ్‌ ఇవ్వనని చెప్తాడు. ఇందు అక్కడి నుంచి రాజును తిట్టుకుంటూ వెళ్లిపోతుంది. మరోవైపు రాజు సెకండ్‌ హ్యాండ్‌ లాప్‌టాప్‌ బిజినెస్‌ చేయడానికి ఒక వ్యక్తి దగ్గర కాంట్రాక్ట్ చేసుకుంటాడు. రాజు, లక్కీ ఇద్దరూ 50వేల పెట్టుబడితో 5లక్షల కాంట్రాక్ట్‌ వచ్చిందని హ్యాపీగా ఫీలవుతారు.

Advertisement

ఇంటర్వ్యూకి వెళ్లిన ఇందు.. లాయరు దగ్గరకు వెళ్లిన అపర్ణ ఇద్దరూ ఒకేసారి ఇంటికి వస్తారు. లోపలికి వెళ్తారు. అప్పుడే సుభాష్‌ రూంలోంచి రేఖ, డాక్టర్‌ బయటకు వస్తారు. వాళ్లను చూసి అపర్ణ, ఇందు షాక్‌ అవుతారు. సుభాష్ కు ఏమైందని అడుగుతారు. దీంతో సుభాష్‌కు బ్రీతింగ్‌ ప్రాబ్లమ్ వచ్చింది నేనే డాక్టర్‌ను పిలిచాను అంటుంది. దీంతో ఇందు, అపర్ణ రూంలోకి వెళ్లి సుభాష్‌ను అడగ్గా మీరేం అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్తూనే ఫిట్స్‌ వచ్చిన వాడిలా గిలగిలా కొట్టుకుంటుంటాడు. హాల్లో కూర్చున్న రేఖ నవ్వుతూ లెక్కలు పెడుతుంది. కంగారుగా ఇందు, అపర్ణ హాల్లోకి వచ్చి రేఖను అడగ్గానే.. రేఖ ఇద్దరిని బెదిరిస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×