E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..డ్రెస్సింగ్ రూంలో వైభ‌వ్ రెడీగా ఉన్నాడు

నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..డ్రెస్సింగ్ రూంలో వైభ‌వ్ రెడీగా ఉన్నాడు
Advertisement

Irfan Pathan:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Team India) మధ్య నిన్న టి20 సిరీస్ (India tour of England, 2026 ) షురూ అయిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. టీమిండియా మొదట బ్యాటింగ్ చేయగా.. భారీ స్కోరు సాధించింది. 20 ఓవ‌ర్లలో 189 ప‌రుగులు సాధించింది. కానీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొదలుపెట్టే సమయానికి భారీ వర్షం పడిన నేపథ్యంలో, మ్యాచ్ రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న జరిగిన తొలి టీ20 సందర్భంగా మరోసారి సంజు శాంసన్ ( Sanju Samson) అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో దారుణంగా విఫలమైన సంజు శాంసన్, నిన్న తొలి టి20 మ్యాచ్ సందర్భంగా ఒకే ఒక పరుగు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో సంజు శాంసన్ పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. అతని స్థానంలో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) బరిలోకి దింపాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విష‌యాన్ని మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కూడా స్ప‌ష్టం చేశారు. నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..డ్రెస్సింగ్ రూంలోనే వైభ‌వ్ ఉన్నాడంటూ సంజుకు వార్నింగ్ ఇచ్చారు ఇర్ఫాన్ ప‌ఠాన్ (Irfan Pathan). దీంతో ఇర్ఫాన్ ప‌ఠాన్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Tamim Iqbal Trolls Team India Tamim Iqbal: ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు

నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..డ్రెస్సింగ్ రూంలో వైభ‌వ్ రెడీగా ఉన్నాడు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన సంజు శాంసన్… ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ సిరీస్ లలో విఫలమవుతున్నాడు. ఐర్లాండ్ తో జరిగిన రెండు టీ20 లలో కేవలం ఐదు పరుగులు మాత్రమే సాధించాడు. మొదటి మ్యాచ్ లో 5 పరుగులు చేసిన సంజు శాంసన్, రెండో టి20లో డక్ అవుట్ అయ్యాడు. ఇక నిన్న ఇంగ్లాండ్ తో రద్దయిన మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగు సాధించాడు. ఈ క్రమంలో సంజు పై విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. సంజు శాంసన్ చిత్త ప్రదర్శన పై ఇర్ఫాన్ పఠాన్ కూడా మండిపడ్డారు. నీకు చేతకాకపోతే వెంటనే తప్పుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు.

డ్రెస్సింగ్ రూమ్ లో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్య వంశీ అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని హెచ్చరించారు. వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో సంజు శాంసన్ అద్భుతంగా రాణించాడు. టీమిండియా కు టైటిల్ కూడా అందించాడని చెప్పవచ్చు. కానీ ప్రతి మ్యాచ్ లో సంజు శాంసన్ ఆడాల్సిందేనని ఇర్ఫాన్ పఠాన్ కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఒక మ్యాచ్ లో నాలుగింటిలో ప్లాఫ్ షో కనబరిస్తే ఫలితం ఉండబోదని వెల్లడించారు. సంజు శాంసన్ ప్రదర్శన ఇలాగే ఉంటే.. కచ్చితంగా 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడని వార్నింగ్ ఇచ్చారు. ఆ వైభవ్ కూడా ప్రతి మ్యాచ్ లో సంజు కంటే బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చే తరహాలో కనిపిస్తున్నాడు.

Advertisement

Also Read: Mike Hesson on Pakistan not winning the ICC events: పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

Related News

ఇషాన్ కిష‌న్ కు అభిషేక్ వెన్నుపోటు..మైదానంలోనే గొడ‌వ‌కు దిగిన ప్లేయ‌ర్లు !

ఇంగ్లండ్ సిరీస్ లో న‌న్ను స‌రిగ్గా వాడుకోలేదు..బౌలింగ్ కూడా ఇవ్వ‌లేదు

టీమిండియాను దెబ్బ‌కొట్టిన‌ జై మూండ్రాకు పాకిస్తాన్ బంప‌ర్ ఆఫ‌ర్‌

Daryll Cullinan: టీమిండియాలో ఆడ‌టం నీ వ‌ల్ల కాదు..వెళ్లి గ‌ల్లీ క్రికెట్ ఆడుకో

వైభ‌వ్ బాగా ఆడ‌తాడ‌ని టీమిండియా ప్లేయ‌ర్లే అరంగేట్రం ఆపుతున్నారు

ముసుగులు వేసుకుని, పాకిస్తాన్ లో తిర‌గండి..లేక‌పోతే రాళ్ల‌తో కొడ‌తారు

టీమిండియాలో ‘ఒక్కడు’ సరిగ్గా లేడు, వైట్ వాష్ చేయండి..ఈ ఛాన్స్ వ‌దులుకోవ‌ద్దు

Big Stories

×