E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Tamim Iqbal: ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు

Tamim Iqbal: ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు
Advertisement

Tamim Iqbal Trolls Team India:  టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Team India vs. Ireland) మధ్య రెండు రోజుల కిందట టీ20 సిరీస్ పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంటులో వరల్డ్ ఛాంపియన్ గా ఉన్న టీమిండియా (Team India) చిత్తుగా ఓడిపోయింది. టాప్ టెన్ లో లేని ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయింది టీమ్ ఇండియా. దీంతో టీమ్ ఇండియా పురుషుల జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి టీమ్ ఇండియాను ట్రోలింగ్ చేస్తున్నారు. ప‌సికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోయారంటూ ర్యాంగింగ్ చేయడం మొద‌లెట్టారు. ఇక తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ త‌మీమ్ ఇక్బాల్ (Tamim Iqbal ) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదంటూ ప‌రువు తీశారు. అందుకే ఐర్లాండ్ చేతిలో టీమిండియా వైట్ వాష్ అయిందంటూ సెటైర్లు వేశారు. ఫ్లాట్ పిచ్ లు ఉంటేనే, టీమిండియా ప్లేయ‌ర్లు సెంచ‌రీలు, అర్ధ సెంచ‌రీలు చేస్తూ…ఇర‌గ‌దీస్తార‌ని చుర‌క‌లు అంటించారు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( BCB) ప్రెసిడెంట్ త‌మీమ్ ఇక్బాల్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Muhammad Waseem Blames Team India టీమిండియాను ఆ రెండు శాపాలు ప‌ట్టి పీడుస్తున్నాయి..అందుకే చిత్తుగా ఓడిపోయింది

ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు

Advertisement

ఐర్లాండ్ ( Ireland Team) చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీమ్ ఇండియాను ( Team India) ఉద్దేశించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ తమీమ్ ఇక్బాల్ ( Bangladesh Cricket Board President Tamim Iqbal) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ క్రికెటర్లు ఐసీసీ, ఐపీఎల్ టోర్నమెంట్లలో మాత్రమే అద్భుతంగా రాణిస్తారని చురకలు అంటించారు. కేవలం ఫ్లాట్ మైదానాలపైన మాత్రమే టీమిండియా క్రికెటర్లు రెచ్చిపోయి ఆడతారని వ్యాఖ్యానించారు. 12 లేదా 15 బంతుల్లోనే అర్థ సెంచరీలు చేయడం చూసామని గుర్తు చేశారు. ఇక కొంత మంది క్రికెటర్లైతే ఐపీఎల్ లో 30 బంతులలోనే సెంచరీలు చేస్తున్నారని దారుణంగా ర్యాగింగ్ చేశారు. అదే విదేశీ మైదానాలలో మాత్రం ఆడటం వీళ్ళకు చేతకాదంటూ చురకలు అంటించారు.

అందుకే ఐర్లాండ్ తయారుచేసిన పిచ్ పై బొక్క బోర్లా టీమిండియా పడిందని సెటైర్లు పేల్చాడు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో అర్థ సెంచరీలు అలాగే సెంచరీలు చేసిన ఇండియన్ క్రికెటర్లు… ఐర్లాండ్ లో మాత్రం ఒక్క అర్థ సెంచరీ కూడా నమోదు చేయలేక విఫలమయ్యారని చురకలు అంటించారు. ఇలాగే టీమిండియా ప్లేయ‌ర్లు ముందుకు వెళితే, ఐసీసీ ర్యాకింగ్స్ లో దారుణంగా కింద‌కు ప‌డిపోతుంద‌ని హెచ్చ‌రించారు. ఐపీఎల్ ( IPL ) టోర్న‌మెంట్ కార‌ణంగా టీమిండియా భ‌విష్య‌త్తు అంధ‌కారంలో ప‌డ‌నుంద‌ని తెలిపారుబంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ తమీమ్ ఇక్బాల్.

Advertisement

Also Read: Rajasthan-born Jai Moondra moved to Dublin : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్‌..ఓడించింది మ‌న ఇండియా వాడే, ఎవ‌రీ జై మూండ్రా ?

 

Related News

5 కేజీల‌ పొట్ట ఉన్నా వైభ‌వ్ ను ఆడిస్తున్నారు..క‌మ్రాన్ అక్మ‌ల్ సంచ‌ల‌నం !

టీమిండియా ఛాప్ట‌ర్ క్లోజ్‌..నెక్ట్స్‌ పాకిస్తాన్, ఐర్లాండ్ కొత్త షెడ్య‌ల్ ఇదే

టీమిండియాలో ముంబై వాళ్ల‌కే అవ‌కాశాలు.. బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్లేయ‌ర్ల‌కు నో ఛాన్స్ ?

ఒలింపిక్స్ 2028కి ముందు పాకిస్తాన్ కు బిగ్ షాక్‌..డిసెంబ‌ర్ 31కి డెడ్ లైన్‌

టీమిండియా ప‌త‌నం మొద‌లైంది..ఇక వాళ్ల‌ను దేవుడు కూడా కాపాడ‌లేడు

Tanveer Ahmed: టీమిండియాను ఐర్లాండ్ వైట్ వాష్ చేశాక‌, కంటి నిండా నిద్ర‌పోయాను

టీమిండియాను ఆ రెండు శాపాలు ప‌ట్టి పీడుస్తున్నాయి..అందుకే చిత్తుగా ఓడిపోయింది

Big Stories

×