E-Paper
Advertisement

ప్రియులను కూడా పంచుకునే అక్కాచెల్లెళ్ళు… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్

ప్రియులను కూడా పంచుకునే అక్కాచెల్లెళ్ళు… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్
Advertisement

Psychological Thriller Series : అక్కాచెల్లెళ్ల బంధం ఎంత బలంగా ఉంటుందంటే… కొన్నిసార్లు కొట్టుకున్నా ఒకరంటే ఒకరు ప్రాణం ఇచ్చుకుంటారు. కానీ అదే అక్కాచెల్లెళ్ళు ఒకరి ప్రాణం మరొకరు బలి కోరితే, ఒకరి లైఫ్ లోకి మరొకరు దూరి వాళ్ళలా బతకాలి అనుకుంటే ? ఎంత బ్రూటల్ గా ఉంది కదా ఈ ఆలోచన. ఆ ఆలోచననే ఆచరణాత్మకంగా పెట్టి, ఓ సిరీస్ రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఓటీటీలో ఉన్న ఆ అత్యంత ఉత్కంఠభరితమైన సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్‌ పేరే ‘డెడ్ రింగర్స్ (Dead Ringers)’. 2023లో విడుదలైన ఈ మినీ-సిరీస్ డేవిడ్ క్రోనెన్‌బర్గ్ 1988 నాటి క్లాసిక్ చిత్రం ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్ ను ఒక్కసారి చూస్తే నెలల తరబడి మిమ్మల్ని మరచిపోనీయదు.

కథలోకి వెళ్తే…

సిరీస్ అంతా ఇద్దరు కవల సిస్టర్స్ చుట్టూ తిరుగుతుంది. అందులో బెవర్లీ మాంటిల్ ఒకరు. చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న డాక్టర్ ఆమె. గైనకాలజిస్ట్ గా పని చేస్తుంది. మహిళల ప్రసవ ప్రక్రియను మరింత సురక్షితంగా మార్చాలనేది ఈమె ఆశయం. ఇక మరో అమ్మాయి పేరు ఎలియట్ మాంటిల్. ఈమె బెవర్లీకి కవల సోదరి. మాంటిల్ తో పోలిస్తే ఈమె పూర్తిగా భిన్నమనస్తత్వం కలిగి ఉంటుంది. బోల్డ్ గా ఉంటుంది. దూకుడు స్వభావం, డ్రగ్స్ అలవాటు ఉన్న ల్యాబ్ సైంటిస్ట్ కూడా. వైద్య రంగంలోని ఎథిక్స్ పట్టించుకోకుండా కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటుంది.

Advertisement

బెవర్లీ మాత్రమే కాదు ఎలియట్ కూడా లండన్‌ కు చెందిన ప్రసిద్ధ గైనకాలజిస్టులు. వీరిద్దరి మధ్య ఎంత విడదీయరాని బంధం ఉంటుందంటే… ఒకే ఇల్లు, ఒకే జాబ్, చివరికి డ్రగ్స్, ప్రియులను కూడా పంచుకుంటారు. అంతేనా ఎదుటి వారిని మోసం చేయడానికి తరచూ ఒకరి స్థానంలోకి ఒకరు మారిపోతుంటారు. మహిళల వైద్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తేవడం కోసం ఒక అత్యాధునిక ‘బర్తింగ్ సెంటర్’ను ప్రారంభించాలనేది వీరి కల. దీనికోసం ‘రెబెక్కా పార్కర్’ అనే ఒక అత్యంత ధనవంతురాలైన వ్యాపారవేత్త నుండి భారీ ఫండింగ్ ను తీసుకుంటారు.

ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. బెవర్లీ నెమ్మదిగా ‘జెనీవీవ్’ అనే ఒక నటితో ప్రేమలో పడుతుంది. జెనీవీవ్ జీవితంలోకి ప్రవేశించాక బెవర్లీ క్రమంగా తన సోదరి ఎలియట్ నీడ నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా బతకాలని కోరుకుంటుంది. కానీ మరో సిస్టర్ కు ఇది నచ్చదు. బెవర్లీ తనకి దూరమవుతోందని ఎలియట్ తీవ్రమైన అసూయ, పిచ్చితో రగిలిపోతుంది. ఎలియట్ చేసే కొన్ని అక్రమ వైద్య ప్రయోగాలు, ఒక సర్జరీ విఫలం కావడం వల్ల ఇద్దరి మధ్య బంధం పూర్తిగా దెబ్బతింటుంది. ఇక ఆ తరువాత బేవర్లి సరోగసి, ల్యాబ్ ప్రయోగాల ద్వారా కవల పిల్లలకు ప్రెగ్నెంట్ అవుతుంది.

Advertisement

కొన్ని రోజుల తరువాత ఇద్దరు సిస్టర్స్ ఒక ల్యాబ్ లో కలుసుకుంటారు. దీంతో కథ షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది ? మరి ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటి ? బేవర్లిని ఎలియట్ ఏం చేసింది ? ఆమె కడుపులో ఉన్న పిల్లల సంగతేంటి ? అనేది తెలియాలంటే ఈ సిరీస్ ను వీక్షించాల్సిందే. ఒక్కొక్క ఎపిసోడ్‌లో వెల్లడయ్యే ట్విస్టులు మిమ్మల్ని చివరి ఎపిసోడ్ వరకు కట్టిపడేస్తాయి. 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రాచెల్ వైజ్ నామినేషన్ తో సత్తా చాటింది. ఈ 6 ఎపిసోడ్ల సైకలాజికల్ సిరీస్ ను ఒక్కసారి చూస్తే మరచిపోలేరు. ‘డెడ్ రింగర్స్’ ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో లేదు, కానీ ఇంగ్లీష్ ఆడియోతో సబ్‌టైటిల్స్ సహాయంతో చూడవచ్చు.

Read Also: 40 మంది మిస్టీరియస్ మరణాలు… నకిలీ డిగ్రీలు, మెడికల్ ఎగ్జామ్ లీక్స్ తో మెంటలెక్కించే సిరీస్

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×