Ishan Kishan-Aditi Hundia: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో టీమిండియా చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ( Narendra Modi Stadium, Ahmedabad) ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, Final) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో 96 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. దీంతో ముచ్చటగా మూడవసారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టైటిల్ అందుకుంది టీమిండియా. ఇలాంటి నేపథ్యంలోనే భారతదేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అటు గ్రౌండ్ లో టీమిండియా ప్లేయర్లు కూడా సంబరాలు చేసుకున్నారు. తీన్మార్ స్టెప్పులతో డ్యాన్సులు కూడా వేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన నేపథ్యంలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లందరూ సంబరాలు చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా గడిపారు ప్లేయర్లు. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇశాన్ కిషన్ ( Ishan Kishan ) ప్రియురాలు అదితి హుండియా ( Aditi Hundia ) కూడా స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ తో డాన్సులు చేసిన అదితి హుండియా ( Aditi Hundia )… స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. ఇక ఈ సందర్భంగా తన ప్రియురాలు అదితి హుండియాకి లిప్ కిస్ ఇచ్చాడు ఇషాన్ కిషన్. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ముందుగా రొమాంటిక్ గా తన ప్రియురాలి అదితి హుండియాని చూసి.. అందరి ముందే లిప్ కిస్ ఇచ్చాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి అదితి హుండియా ( Aditi Hundia )తో రిలేషన్ లో ఉన్నాడట టీమిండియా డేంజర్ ఆటగాడు ఇషాన్ కిషన్. ఈ విషయాన్ని ఇటీవల కాలంలో ఇశాన్ కిషన్ తాత కూడా వెల్లడించారు. ఇప్పుడు ఓకే అన్న ఇషాన్ పెళ్లి చేస్తామని స్పష్టం చేశాడు. దీనికి తగ్గట్టుగానే ఈ ఇద్దరు చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారు.
టీమిండియా ప్లేయర్లందరూ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సంబరాలు చేసుకుంటే… న్యూజిలాండ్ ప్లేయర్లు మాత్రం ఎమోషనల్ అవుతూ తమ ఫ్యామిలీతో బాధను పంచుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ డేంజర్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ ( Glenn Phillips) కూడా తన భార్యతో బాధను పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన భార్య కేట్ విక్టోరియాకు లిప్ కిస్ ఇచ్చి ఎమోషనల్ అయ్యాడు. దీంతో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అటు ఇష్ సోధీ కూడా తన భార్యకు ఇచ్చాడు.
Ishaan Kishan is kissing his girlfriend.😭😍 pic.twitter.com/2QAo3aB8lq
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 9, 2026
Lovely moment of Glenn Phillips with his wife Kate Phillips, and Ish Sodhi with his wife Angelina van Roosmalen after the T20 World Cup final.❤️ pic.twitter.com/orEuLqTL0p
— Mention Cricket (@MentionCricket) March 9, 2026