E-Paper
Advertisement

New Lexus ES: కొత్త లెక్సస్ ES లాంచ్ డేట్ ఫిక్స్, వావ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

New Lexus ES: కొత్త లెక్సస్ ES లాంచ్ డేట్ ఫిక్స్, వావ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

ప్రముఖ ఆటో మోబైల్ దిగ్గజం లెక్సస్ మరో క్రేజీ కారును అందుబాటులోకి తీసుకురాబోతోంది. లెక్సస్ ES పేరుతో భారతీయ మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. ఈ 8వ తరం మోడల్ ను కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 2025లో ఆవిష్కరించింది. ఇది భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ E-క్లాస్, BMW 5 సిరీస్ LWB, ఆడి A6కు పోటీగా ఉంటుంది. ఈ కొత్త ES గురించి కీలక వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇండియాలో మార్చి 20న కొత్త లెక్సస్ ES లాంచ్!

లెక్సస్ మార్చి 20న భారత్ లో కొత్త ESని లాంచ్ కానుంది. ఇప్పటికే ఉన్న ES లాగానే, ధరలను పోటీగా ఉంచేందుకు  కొత్త తరం మోడల్‌ను కంప్లీట్లీ నాక్డ్ డౌన్ ద్వారా అమ్మే అవకాశం ఉంటుంది. కొత్త ES ధర దాదాపు రూ. 68 లక్షల నుంచి 70 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుందని భావిస్తున్నారు.

కొత్త లెక్సస్ ES డిజైన్ గురించి.. 

Advertisement

కొత్త ES దాని పాత మోడల్ తో పోల్చితే, మరింత షార్ప్ లుక్ లో ఆకట్టుకోనుంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్ వావ్ అనిపిస్తుంది.   ముందు భాగంలో L షేప్ DRLలు, Z- టైప్ క్లస్టర్‌ లో ఫిక్స్ చేయబడి ఉంటుంది. హెడ్‌ లైట్ యూనిట్లు దిగువన కుడివైపున ఉన్నాయి. లెక్సస్ స్పిండిల్ గ్రిల్ కొత్త ESలో లేదు. దానికి బదులుగా, డైమండ్ డిజైన్ తో ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ గ్లోస్ బ్లాక్ ట్రిమ్‌ తో ఉంటుంది. కొత్త అల్లాయ్ వీల్ డిజైన్లు, కమ్‌ టైల్ ఎస్క్యూ రూఫ్‌ లైన్‌ ను కలిగి ఉంటుంది. వెనుక భాగంలో అందమైన LED లైట్ బార్ ఉంటుంది. షైనింగ్ తో కూడిన ‘LEXUS’ లెటర్స్ ను కలిగి ఉంటుంది.

కొత్త లెక్సస్ ES ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? 

కొత్త లెక్సస్ ES లోపల కొత్త క్లీనర్, మరింత టెక్నాలజతీతో కూడిన లే అవుట్‌ ను కలిగి ఉంటుంది. 14 అంగుళాల ఇన్ఫోటైన్‌ మెంట్ టచ్‌ స్క్రీన్‌ ను కలిగి ఉంటుంది. ఇది OTA అప్ డేట్స్ ను పొందుతుంది. సెంటర్ కన్సోల్ టచ్ కెపాసిటివ్ బటన్ల లైన్ ను కలిగి ఉంటుంది. త్రి స్పోక్ స్టీరింగ్ వీల్ ఫిజికల్ టచ్ బటన్ ను కలిగి ఉంటుంది. దాని ముందు 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే ఉంటుంది. కొత్త ES మెమరీ ఫంక్షన్లతో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కాన్ఫిగర్ చేసే యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ రూఫ్, ADAS సూట్, మార్క్ లెవిన్సన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆప్షనల్ ఒట్టోమన్, మసాజ్ ఫంక్షన్లతో రిక్లైనింగ్ రియర్ సీట్లు సహా మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది.

కొత్త లెక్సస్ ES పవర్‌ట్రెయిన్స్ గురించి..

Advertisement

అంతర్జాతీయంగా, కొత్త ES హైబ్రిడ్, EV పవర్‌ ట్రెయిన్స్ తో వస్తుంది. అవుట్‌ గోయింగ్ ES ప్రస్తుతం ఇండియాలో హైబ్రిడ్‌ గా అమ్ముడవుతున్నది. లెక్సస్ EV వెర్షన్‌ను కూడా ఇండియాలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. కొత్త లెక్సస్ ES 300h 197hp 2.0 లీటర్, 201hp 2.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో వస్తుంది. హై స్పెక్ 350h 247hp స్టేట్ ఆఫ్ ట్యూన్‌లో రెండో సెటప్‌ను కలిగి ఉంటుంది. e-CVT అన్ని ES హైబ్రిడ్ వేరియంట్లకు ప్రామాణికంగా ఉంటుంది. ES EV 350e, 550e వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవి 77kWh, 74.7kWh బ్యాటరీ ప్యాక్‌ ను కలిగి ఉంటుంది. ES 350eకి 685 కి.మీ, ES 550e 610 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.

Read Also: ఇండియాలో అత్యంత చౌకైన ఆటోమేటిక్ కార్లు, జస్ట్ రూ. 4.75 లక్షల నుంచే..

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×