Jacob Bethell: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఆస్ట్రేలియా ( Australia) అత్యంత దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్ స్టేజిలోనే ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది. ఈ టోర్నమెంట్ లో పసికూన జింబాబ్వే అలాగే శ్రీలంక లాంటి చిన్న జట్ల చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా స్థానంలో జింబాబ్వే సూపర్ 8కి దూసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా జట్టుపై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా ఆస్ట్రేలియా ఎలిమినేట్ (Australia’s T20I World Cup 2026 exit ) కావడంపై ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జాకబ్ బెతెల్ ( Jacob Bethell ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా ఓడిపోవడం మంచిదే.. కానీ ఇంత దారుణంగా ఓడిపోవడం ఘోర అవమానకరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు జాకబ్ బెతెల్. ప్రపంచ కప్ నుంచి ఎలిమినేట్ అయిన ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇంటికి వెళ్లి చెక్క భజన చేసుకోవాల్సిందే అంటూ చురకలు అంటించారు జాకబ్ బెతెల్. దీంతో జాకబ్ బెతెల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 దశకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నడూ లేని విధంగా ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయింది. మొదట పసికూన జట్టు అయిన జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అక్కడే ఆస్ట్రేలియాకు తేడా కొట్టేసింది. ఆ తర్వాత శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడి, గ్రూప్ స్టేజ్ లోనే బ్యాగులు సర్దుకుంది ఆస్ట్రేలియా. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాపై దారుణంగా కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జాకబ్ బెత్లె.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నుంచి ఆస్ట్రేలియా ఎలిమినేట్ కావడం శుభ పరిణామం అంటూ ఎద్దేవా చేశాడు జాకబ్. ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఒళ్లంతా బలుపే ఉందని ఫైర్ అయ్యారు. అలాంటి బలుపు తగ్గాలంటే ఇలాంటి ఓటములు చాలా రావాలని జాకబ్ బెతెల్ ( Jacob Bethell) వెల్లడించారు. ఆస్ట్రేలియా ఎలిమినేట్ కావడం మాత్రం తమకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవమానకరమైన ఓటమి ఆస్ట్రేలియా చవిచూసిందని వ్యాఖ్యానించారు జాకబ్. దీంతో జాకబ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఎలిమినేట్ కావడం వెనుక మిచెల్ మార్ష్ చేసిన చెండాలపు పని ఉందని కామెంట్స్ చేస్తున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీ పైన మిచెల్ మార్ష్ కాలు పెట్టాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియాకు దరిద్రం మొదలైందని అంటున్నారు. అలా కాలు పెట్టడం వల్ల ఆస్ట్రేలియాకు ఈ ఓటములు ఎదురవుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
JACOB BETHELL ON AUSTRALIA BEING KNOCKED OUT OF WC.
"It's good to see". 😂🔥 [BBC]
— Salman. (@TsMeSalman) February 21, 2026
Jacob Bethell took a cheeky dig at Australia’s World Cup exit 🇦🇺👀
Follow me for more #Australia #T20WorldCup pic.twitter.com/EaorRBBzOA— Daily Dose (@rehman7614) February 21, 2026