Jason Gillespie: పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan Cricket Team) అంటేనే పెద్ద జోక్ అయిపోయింది. ప్రపంచంలో ఏ క్రికెట్ జట్టుకు రాని సమస్యలు, ఆటంకాలు పాకిస్తాన్ జట్టుకు మాత్రమే వస్తాయి. ఏది జరిగినా పాకిస్తాన్ క్రికెట్ జట్టును మాత్రం ట్రోలింగ్ గట్టిగానే చేస్తారు. అయితే లేటెస్ట్ గా మాజీ కోచ్ లు వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్టర్ల మధ్య వార్ మొదలైంది. ఒకరినొకరు సోషల్ మీడియా వేదికగా బండ బూతులు తిట్టుకుంటున్నారు. పాకిస్తాన్ కోచ్ గా పని చేసిన జేసన్ గిలెస్పీ, గ్యారీ కిర్‌స్టెన్ లను ఉద్దేశించి పాకిస్తాన్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ (Aaqib Javed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ సెలెక్టర్ల మాటలు ఈ ఇద్దరు కోచ్‌లు జేసన్ గిలెస్పీ (Jason Gillespie), గ్యారీ కిర్‌స్టెన్ లను ( Gary Kirsten) వినలేదని. అందుకే పీకి పడేసామని బాంబు పేల్చారు. అలాంటి చెత్త తమకు అవసరం లేదన్నారు. అయితే దీనికి జేసన్ గిలెస్పీ తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఆకిబ్ జావేద్ తెలివి తక్కువ దద్దమ్మ, వాడు చేతకాని వెధవ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నోటికి ఏది వస్తే అదే మాట్లాడి.. వార్తల్లో నిలుస్తాడని బాంబు పేల్చారు. అనవసరంగా తమపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితువు పలికారు. దీంతో జేసన్ గిలెస్పీ వర్సెస్ ఆకిబ్ జావేద్ మధ్య వివాదం హట్ టాపిక్ అయింది.
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఈ మధ్య కాలంలో చాలామంది కోచ్ లుగా వ్యవహరించారు. ఆరు నెలలకు ఒక సారి కొత్త కోచ్ వస్తూ పోతున్నారు. ఈ లిస్టులో గ్యారీ కిర్‌స్టెన్ తో పాటు జేసన్ గిలెస్పీ కూడా ఉన్నారు. పాకిస్తాన్ హెడ్ కోచ్ గా జేసన్ గిలెస్పీ 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2024 వరకు కొనసాగారు. రెండు సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకొని.. మధ్యలోనే తొలగించబడ్డారు. అదే సమయంలో గ్యారీ కిర్‌స్టెన్ పాకిస్తాన్ వైట్ బాల్ కోచ్ గా పని చేశారు. ఏప్రిల్ 2024 నుంచి అక్టోబర్ 2024 వరకు కొనసాగారు. ఇద్దరినీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒత్తిడి తీసుకువచ్చి బయటకు పంపింది.
దీనిపై వివాదం రాజుకోగా.. తాజాగా ఈ అంశంపై పాకిస్తాన్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ స్పందించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, సెలక్టర్లు చెప్పినట్లుగా గిలెస్సీ, గ్యారీ అస్సలు వినలేదని ఆరోపణలు చేశారు. తమకు నచ్చిన బాట ఎంచుకొని పాకిస్తాన్ క్రికెట్ జట్టును నాశనం చేశారని బాంబు పేల్చారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు గిలెస్పీ కౌంటర్ ఇచ్చారు. వాడికి ఏది చేతకాదని.. అనవసరంగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకిబ్ జావేద్ మప్పెట్ అంటూ పరువు తీశారు. ఇకపై తమ గురించి తప్పుడుగా వాగితే పళ్ళు రాలగొడతామని ఆకిబ్ జావేద్ ను హెచ్చరించారు. పాకిస్తాన్ సెలెక్టర్లు కుట్రలు చేసి తమను బయటకు పంపించారని అటు గ్యారీ కిర్‌స్టెన్ కు మద్దతుగా నిలిచారు.
Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియన్ పోలీసులు !
Jason Gillespie fired back at Aaqib Javed, calling him a "muppet" & his comments "nonsense."
– Glenn McGrath and Damien Fleming were laughing throughout. 😐 pic.twitter.com/T3QZJFiXNm
— Sheri. (@CallMeSheri1_) July 18, 2026