E-Paper
Advertisement

Sarfaraz Khan-Abhishek Sharma: అభిషేక్ శర్మ ఓవర్‌లో 6, 4, 6, 4, 6, 4..15 బాల్స్‌లో స‌ర్ఫ‌రాజ్ అర్ధ సెంచ‌రీ

Sarfaraz Khan-Abhishek Sharma: అభిషేక్ శర్మ ఓవర్‌లో 6, 4, 6, 4, 6, 4..15 బాల్స్‌లో స‌ర్ఫ‌రాజ్ అర్ధ సెంచ‌రీ
Advertisement

Sarfaraz Khan-Abhishek Sharma: విజయ్ హజారే టోర్నమెంట్ ( Vijay Hazare Trophy Elite 2025-26 ) నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan ) విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. విజయ్ హజారే టోర్నమెంట్ లో భాగంగా ముంబై వర్సెస్ పంజాబ్ ( Mumbai vs Punjab ) మధ్య ఇవాళ మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో పంజాబ్ జట్టుపై సర్ఫ‌రాజ్ ఖాన్ అద్భుతంగా రాణించాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు సర్ఫ‌రాజ్ ఖాన్. అంతేకాదు పంజాబ్ ఆటగాడు అభిషేక్ శర్మ వేసిన ఓవర్ లో మొత్తం 30 పరుగులు రాబట్టాడు.

అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) వేసిన ఓవర్ లో 6,4,6,4,6,4 వరుసగా బాది చుక్కలు చూపించాడు సర్ఫరాజ్ ఖాన్. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. సిక్సర్లు బాదే అభిషేక్ శర్మకు సర్ఫరాజ్ ఖాన్ నరకం చూపించాడని కామెంట్స్ పెడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేయడంతో సర్ఫరాజ్ ఖాన్ ఇంత భయంకరంగా ఆడుతున్నాడని మరీ, కొంతమంది అంటున్నారు. ఈ ఇన్నింగ్స్ వెనుక మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడని మరికొంతమంది చెబుతున్నారు.

Advertisement

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

అభిషేక్ శర్మ ఓవర్‌లో 6, 4, 6, 4, 6, 4

విజయ్ హజారే టోర్నమెంట్ లో  ( Vijay Hazare Trophy Elite 2025-26 ) సర్ఫరాజ్ ఖాన్ మరోసారి విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులతో రెచ్చిపోయాడు. అంతేకాదు ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) వేసిన ఓవర్ లో 30 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు సిక్సుల‌తో పాటు మూడు బౌండరీలు సాధించాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ నేపథ్యంలోనే 15 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ అర్థ సెంచరీ నమోదు చేసుకొని చరిత్ర సృష్టించాడు. దీంతో బరోడా ( Baroda) బ్యాటర్ అతిథ్ 16 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు సర్ఫరాజ్ ఖాన్. అయితే ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ రెచ్చిపోయి ఆడినప్పటికీ, ముంబైని గెలిపించలేకపోయాడు. పంజాబ్ చేతిలో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ముంబై ఓడిపోయింది.

ఒకే ఒక్క పరుగుతో గెలిచిన పంజాబ్

Advertisement

విజయ్ హజారే టోర్నమెంట్ లో ( Vijay Hazare Trophy Elite 2025-26 )  భాగంగా ముంబై వర్సెస్ పంజాబ్ ( Mumbai vs Punjab, Group C,) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 45.1 ఓవర్లు ఆడిన పంజాబ్ 216 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. పంజాబ్ జట్టులో రమణ్ దీప్ సింగ్ ( Ramandeep singh) 72 పరుగులు సాధించి అదరగొట్టాడు. ఇక 216 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముంబై అట్టర్ ఫ్లాఫ్ అయింది. 26.2 ఓవర్లలో 215 పరుగులు చేసి ఆలౌట్ అయి ఓడిపోయింది.

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×