E-Paper
Advertisement

Shivang Kumar: SRHలో మ‌రో మిస్ట‌రీ మెండిస్..రూ.30 ల‌క్ష‌ల‌కే కొనేసిన కావ్య‌పాప‌, 5 వికెట్ల‌తో ఇర‌గ‌దీసిన‌ శివంగ్

Shivang Kumar: SRHలో మ‌రో మిస్ట‌రీ మెండిస్..రూ.30 ల‌క్ష‌ల‌కే కొనేసిన కావ్య‌పాప‌, 5 వికెట్ల‌తో ఇర‌గ‌దీసిన‌ శివంగ్
Advertisement

Shivang Kumar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక్కో ప్లేయర్ వెలుగులోకి వస్తున్నాడు. విజయ్ హజారే టోర్నమెంట్ నేపథ్యంలో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి, తమ సత్తా చాటుతున్నారు. వార్తల్లో నిలుస్తున్నారు. ఈ తరుణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిన శివాంగ్ కుమార్ ( Shivang Kumar ) సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. విజయ్ హజారే టోర్నమెంట్ నేపథ్యంలో ఐదు వికెట్లు పడగొట్టిన శివాంగ్ కుమార్ ఇప్పుడు వైరల్ గా మారాడు. కేవలం రూ.30 లక్షలకే ఇతన్ని హైదరాబాద్ ఓనర్ కావ్య పాప కొనుగోలు చేశారు. తక్కువ డబ్బులు అయినప్పటికీ తన మిస్టరీ బౌలింగ్ తో విజయ హజారే టోర్నమెంట్లో అదరగొట్టి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ ( SRH) ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

ఐదు వికెట్లతో ఇరగదీసిన సన్ రైజ‌ర్స్‌ ఆటగాడు శివాంగ్ కుమార్

Advertisement

విజయ్ హజారే టోర్నమెంట్ 2026 నేపథ్యంలో అద్భుతంగా రాణించాడు సన్రైజర్స్ ఆటగాడు శివాంగ్ కుమార్ ( Shivang Kumar ). ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ కర్ణాటక వర్సెస్ మధ్యప్రదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. మధ్యప్రదేశ్ జట్టు తరఫున బరిలోకి దిగిన శివాంగ్ కుమార్… తన మిస్టరీ బౌలింగ్ తో ఐదు వికెట్లు పడగొట్టాడు. కర్ణాటకకు చెందిన ఐదుగురిని తన తెలివైన బౌలింగ్ తో బోల్తా కొట్టించి నడ్డి విరిచాడు. దీంతో 47.4 ఓవర్లలో కర్ణాటక జట్టు 207 పరుగులకు అలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో శివాంగ్ కుమార్ ( Shivang Kumar ) తీసిన ఐదు వికెట్లు కూడా చాలా కీలకమైనవి. దీంతో కావ్య పాపను అందరూ మెచ్చుకుంటున్నారు. మొన్న‌టి మినీ వేలంలో కేవలం రూ.30 లక్షలకే శివాంగ్ కుమార్ ను కావ్య పాప కొనుగోలు చేశారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు విజయ్ హజారే టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడుతున్నాడు శివాంగ్ కుమార్. ఇదే ఆట‌తీరును ఐపిఎల్ 2026 టోర్నమెంట్లో శివాంగ్ కుమార్ ప్రదర్శిస్తే, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆపడం ఎవరి తరం కాదు అంటున్నారు ఫ్యాన్స్.

శివంగ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప కొనుగోలు చేసిన శివాంగ్ కుమార్ డొమెస్టిక్ క్రికెట్ లో ఆడుతున్నాడు. ఇతడు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేయగలుగుతాడు. అంటే సన్రైజర్స్ హైద‌రాబాద్ చేతిలోకి మంచి ఆల్రౌండర్ వచ్చాడన్నమాట. స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివాంగ్ కుమార్. ప్రస్తుతం మధ్యప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భూపాల్ జట్టుకు కూడా శివాంగ్ కుమార్ ఆడిన అనుభవం ఉంది. ఇక ఐపీఎల్ 2026 టోర్నమెంటులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నాడు శివాంగ్ కుమార్. తాజాగా విజయ్ హజారే టోర్నమెంటులో ఐదు వికెట్లు తీసి అందర్నీ ఆకట్టుకున్నాడు. ఈ దెబ్బకు కర్ణాటక పై మధ్యప్రదేశ్ ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

 

Related News

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

351 ప‌రుగులు చేసినా ఓడిపోతారా ? బౌల‌ర్ల‌నే కాదు, గిల్ ను కూడా పీకిపారేయండి

అంపైర్లు నిద్ర‌పోతున్నారా ? రూథ‌ర్ ఫోర్డ్ అస‌లు ఔటే కాదు…ఆకాశ్ చోప్రా సీరియ‌స్‌

ద‌మ్ముంటే నా బౌలింగ్ లో సిక్సులు కొట్టురా…అమీర్ జంగూతో సిరాజ్ గొడ‌వ‌

Big Stories

Advertisement
×