E-Paper
Advertisement

పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమాకు షేక్ హ్యాండ్…వివాదంలో ఐసీసీ బాస్‌ జై షా

పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమాకు షేక్ హ్యాండ్…వివాదంలో ఐసీసీ బాస్‌ జై షా
Advertisement

Jay Shah Fatima Sana Handshake:  మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( Women’s T20 World Cup 2026 tournament ) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ఐసీసీ బాస్ జై షా ( ICC Jay Shah) వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు  (Fatima Sana ) షేక్ హ్యాండ్ ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు. మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కెప్టెన్స్ కార్నివాల్ ఈవెంట్ జరిగింది. ఈ తరుణంలో కెప్టెన్లు అందరూ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఇక ఐసీసీ చైర్మన్ హోదాలో అమిత్ షా కుమారుడు జై షా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో పాకిస్తాన్ కెప్టెన్ కు జై షా షేక్ హ్యాండ్ ( Jay Shah Fatima Sana Handshake) ఇచ్చిన ఫోటో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఐసీసీ బాస్ జై షా పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమాకు షేక్ హ్యాండ్..వివాదంలో ఐసీసీ బాస్‌ జై షా

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ముంబై దాడుల తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా రద్దు అయ్యాయి. ఇక పహాల్గామ్ టెర్రరిస్ట్ ఎటాక్ ( 2025 Pahalgam attack) అనంతరం.. పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా బ్యాన్ చేసింది బీసీసీఐ. దీంతో ఏడాది కాలంగా రెండు జట్ల ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లేదు. అయితే బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసిన ఐసీసీ బాస్ జై షా మాత్రం… పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సానాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ఇంగ్లాండ్ వేదికగా మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇలాంటి క్రమంలో కెప్టెన్ల ఫోటోషూట్ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు.. ఐసీసీ చైర్మన్ హోదాలో జై షా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. అంతమందిలో ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే… జై షా అంతర్జాతీయంగా విలన్ అయ్యేవాడు. అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇది అర్థం చేసుకోని కొంతమంది… ఐసీసీ బాస్ జై షాను విలన్ చేసి మాట్లాడుతున్నారు. దేశద్రోహి ముద్ర వేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

టి20 వరల్డ్ కప్ ఎప్పటినుంచి అంటే

Advertisement

మహిళల టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ జూన్ 12వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఇంగ్లాండు, వేల్స్ వేదికగా జరగనుంది. ఇందులో భాగంగా మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. మొత్తం 33 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. జూన్ 14న ఇండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మ్యాచ్ కూడా జ‌రుగ‌నుంది.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

Related News

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

కామన్వెల్త్ గేమ్స్‌-2026లో షాకింగ్ ఘటన.. గాల్లో విన్యాసాలు, పట్టు తప్పి కిందపడిన జిమ్నాస్ట్

ముఖం మీద ఉమ్మేసినా, తుడిచేసుకుంటోన్న‌ షాహీన్ అఫ్రిది

ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్…లైవ్ మ్యాచ్ లోనే ప‌రువు తీసిన టిమ్ డేవిడ్

Big Stories

Advertisement
×