E-Paper
Advertisement

శవం పక్కనే బుక్… పోలీసులకు హింట్ ఇస్తూ వరుస హత్యలు చేసే మెంటల్ సైకో

శవం పక్కనే బుక్… పోలీసులకు హింట్ ఇస్తూ వరుస హత్యలు చేసే మెంటల్ సైకో
Advertisement

Psychological Thriller OTT : సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో ఉండే ఊహించని ట్విస్టులు, టర్న్ లు ఇచ్చే కిక్కు మామూలుగా ఉండదు. అందుకే ఇలాంటి సినిమాలకు మంచి వ్యూవర్షిప్ ఉంటుంది. మరి మీరు కూడా ఇలాంటి సినిమాల కోసమే వెతుకున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. మరి ఈ మూవీ పేరేంటి ? అది ఏ ఓటీటీలో ఉంది ? అన్న విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

సోనీ లివ్ లో స్ట్రీమింగ్

‘ఇరు ధురువం’ (Iru Dhuruvam) అనేది తమిళంలో వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది సాధారణ పోలీసు కేసు కాదు… సైకోపాత్ కిల్లర్‌ తో పోలీసు ఆఫీసర్ జరిపే తీవ్రమైన మెంటల్ గేమ్ ఇది. SonyLIVలో విడుదలై భారీ పాపులారిటీ సాధించింది. మంచి క్రైమ్ థ్రిల్లర్, సైకలాజికల్ గేమ్స్ ఇష్టపడేవాళ్లకు ఇది బెస్ట్ సిరీస్ ఇది. సస్పెన్స్ కావలసినంత ఉంటుంది.

కలోకి వెళ్తే…

Advertisement

ఇందులో హీరో విక్టర్ సెల్లదురై (నందా). అతను ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్, ధైర్యవంతుడైన పోలీసు ఆఫీసర్. కానీ ఆయన ప్రస్తుతం సిక్ లీవ్‌ లో ఉంటాడు. అతని భార్య గీత (అభిరామి వెంకటాచలం) కొంతకాలం క్రితం రహస్యంగా కనిపించకుండా పోయింది. ఆమె ఎక్కడికి పోయింది, ఎందుకు పోయింది అనేది విక్టర్‌ కి ఇప్పటికీ తెలియదు. ఈ బాధలోనే ఉన్నప్పుడు, నగరంలో ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ వరుస హత్యలు చేయడం కలకలం రేపుతుంది. ఈ కిల్లర్ ఏదో ఊరికే చంపడు. ప్రతి హత్యకి ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ ఉంటుంది. అతను తన హత్యలను తిరుక్కురళ్ (Thirukkural) లోని ఒక్కో శ్లోకంతో ముడిపెడతాడు.

Also Read : టైటాన్ వాచ్ కి ఇంత చరిత్ర ఉందా ?… 6 ఎపిసోడ్‌ల ఈ చారిత్రక డ్రామా సిరీస్ ను చూశారా ?

Advertisement

ప్రతి సీన్‌లో ప్రతీ మర్డర్ లో ఒక హింట్ వదిలేసి పోలీసులను ఛాలెంజ్ చేస్తాడు. హత్యలు చాలా క్రూరంగా, బ్రెయిన్ గేమ్ లాగా ఉంటాయి. ఇది సాధారణ సీరియల్ కిల్లర్ కేసు కాదు ఇంటెన్స్ మెంటల్ యుద్ధం. విక్టర్‌ ను ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి తిరిగి పిలుస్తారు. అతని సహాయకుడు కిషోర్ (అబ్దుల్)తో కలిసి దర్యాప్తు మొదలవుతుంది. కిల్లర్ ప్రతి అడుగు ముందే ఆలోచించి, పోలీసులను తప్పుదారి పట్టిస్తాడు. విక్టర్ తన భార్య మిస్సింగ్ కేసు మధ్యలో ఈ కొత్త కేసును ఎలా ఎదుర్కొంటాడు ? కిల్లర్ గతం ఏమిటి ? ఎందుకు ఇలా చేస్తున్నాడు ? అన్న విషయాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తాయి. ప్రతి ఎపిసోడ్ ముగిసేటప్పటికి “నెక్స్ట్ ఏమవుతుంది?” అనే ఆసక్తి పెరుగుతుంది. అంతేకాదు Iru Dhuruvam 2 కూడా వచ్చింది, అందులో కూడా అదే ఇంటెన్సిటీ కొనసాగుతుంది. ప్రసన్న, నందా వంటి నటుల నటన సిరీస్‌కు మరింత బలం చేకూర్చింది.

Also Read : ఓటీటీలో దుమ్మురేపుతున్న 2500 కోట్ల హర్రర్ థ్రిల్లర్… ఇంకా చూడలేదా ?

Tags

Related News

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Big Stories

Advertisement
×