E-Paper
Advertisement

Jitesh Sharma : ఒక్క జితేష్ శర్మ వల్ల.. ఆ 4 గురు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే ?

Jitesh Sharma : ఒక్క జితేష్ శర్మ వల్ల.. ఆ 4 గురు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే ?
Advertisement

Jitesh Sharma:  సాధార‌ణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేము. ఎప్పుడు ఏ ఆట‌గాడు ఫామ్ లో ఉంటాడో.. ఎప్పుడు ఏ ఆట‌గాడు ఫామ్ లో ఉండ‌డో చెప్ప‌డం క‌ష్టం అని చెప్పాలి. ముఖ్యంగా టీమిండియా క్రికెట‌ర్ జితేష్ శ‌ర్మ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ఐపీఎల్ లో అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడాడు. అప్పుడే వెలుగులోకి వ‌చ్చాడు. తాజాగా నిన్న సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్ లో అద్భుతంగా కీపింగ్ చేశాడు. రివ్యూ స‌మ‌యంలో కూడా వికెట్ల వెనుకాల ఉండి మ‌రీ బౌల‌ర్ల‌కు స‌ల‌హాలు ఇచ్చాడు జితేష్ శ‌ర్మ‌. అత‌ను రివ్యూ తీసుకోమ‌న్న ప్ర‌తీది కూడా స‌క్సెస్ అయింది. ధోనీ మాదిరిగానే జితేష్ శ‌ర్మ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

Also Read : Rachin Ravindra: పలాష్ ఒక్కడే కాదు, రచిన్ రవీంద్ర కూడా స్మృతి మందానను మోసం చేశాడా?

ధోనీ లా మ‌రో వికెట్ కీప‌ర్

Advertisement

కీల‌క స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో అలాగే ఈ వికెట్ కీప‌ర్ వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. అయితే జితేష్ శ‌ర్మ ఇలాగే కీపింగ్ చేస్తూ.. బ్యాటింగ్ లో ఫామ్ క‌న‌బ‌రిస్తే.. మాత్రం ఈ న‌లుగురు ఆట‌గాళ్లకు టీ-20 టీమిండియాలో ఛాన్స్ ద‌క్కే అవ‌కాశాలు చాలా త‌క్కువ అనే చెప్ప‌వ‌చ్చు. వారిలో ముఖ్యంగా రిష‌బ్ పంత్, కే.ఎల్. రాహుల్, ధృవ్ జురెల్, సంజు శాంస‌న్ వీరు న‌లుగురి కంటే కూడా జితేష్ శ‌ర్మ వికెట్ కీపింగ్ అద్భుతంగా చేస్తున్నాడ‌ని నిన్న‌టి మ్యాచ్ లో ప్రూవ్ అయింది. జితేష్ శ‌ర్మ ఇలాగే ఫామ్ లో కొన‌సాగితే మాత్రం.. టీమిండియాలో అన్ని ఫార్మాట్ల‌లో ఆడే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. నిన్న సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ-20 మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాట‌ర్లు స్ట‌బ్స్, డేవిడ్ మిల్ల‌ర్, డోనోవన్ ఫెరీరా, కేశ‌వ్ మ‌హారాజ్ ఈ న‌లుగురు సౌతాఫ్రికా ఆట‌గాళ్లను జితేష్ శ‌ర్మ క్యాచ్ ప‌ట్టి ఔట్ చేశాడు.

జితేష్ శ‌ర్మ ఇన్నింగ్స్ అదుర్స్..

అలాగే జితేష్ వ‌ర్మ 5 బంతుల్లో 10 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అందులో 1 సిక్స్ కూడా ఉండ‌టం విశేషం. 2025 ఐపీఎల్ సీజ‌న్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫైన‌ల్ కి చేరుకోవ‌డంలో కొన్ని కీల‌క మ్యాచ్ ల్లో జితేష్ శ‌ర్మ చెల‌రేగ‌డంతోనే ఆర్సీబీ జ‌ట్టు ఫైన‌ల్ కి చేరుకుంది. దీంతో అప్ప‌టి నుంచి జితేష్ శ‌ర్మ కీల‌క ఆట‌గాడు అని గుర్తించి టీమిండియాలో చోటు సంపాదించాడు. ఇత‌ను టీమిండియా, సెంట్రల్ జోన్, విదర్భ, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇండియా A, బరోడా వంటి జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. ఇప్పుడు టీమిండియాలో కీల‌క ఆట‌గాడిగా మారాడు. ఇత‌ని పై సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. ఇత‌ని ఫామ్ వ‌ల్ల త‌న తోటి వికెట్ కీప‌ర్లు త‌మ ఆట‌ను మార్చుకోకుంటే వారికి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని కొంద‌రు సూచించ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Also Read : Ms Dhoni : ముంబై ఇండియన్స్ లోకి MS ధోని… తెలుగు డైరెక్టర్ పై దారుణంగా ట్రోలింగ్స్!

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×