Ms Dhoni : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా ఐపీఎల్ లో అయితే ఎప్పుడు ఏ క్రీడాకారుడు ఏ టీమ్ లో ఉంటాడో చెప్పడం కష్టం. కొందరూ ఆటగాళ్లు మాత్రమే ఆ జట్లను అంటిపెట్టుకొని ఉంటారు. వారిలో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్, ఎం.ఎస్.ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ మినహా మిగతా ఆటగాళ్లు అందరూ జట్లను మారిన వారే. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ కావడం విశేషం. ఎం.ఎస్. ధోనీ ముంబై ఇండియన్స్ లో ఉన్నాడని.. మన టీమ్ గెలుస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మళ్లీ అందులో ఓ సినిమా టీజర్ లో ఈ సీన్ ఉండటం విశేషం.
Also Read : Ind vs SA 1st T20I: బుమ్రా 100వ వికెట్ పై వివాదం..నో-బాల్ అంటూ ట్రోల్స్, తెరపైకి ఫిక్సింగ్ ఆరోపణలు !
‘ఓం శాంతి శాంతి శాంతిః అనే కొత్త ప్రాజెక్ట్‌లో టాలెంటేడ్ ఫిల్మ్ మేకర్స్ తరుణ్ భాస్కర్ తన అద్భుతమైన నటనతో కూడా తెరపై అలరిస్తున్నారు. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం, సహజమైన హాస్యం, ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీ. వీటిలో భాగంగా ఈ సారి కప్ మనదే అని ఆర్సీబీ జెర్సీ వేసుకున్న అతను అంటే.. ఈసారి ముంబై ఇండియన్స్ కొద్దిగా కష్టమే బావగారు అంటే.. ఎందుకు మా టీమ్ లో ధోనీ ఉన్నాడు కదా. అనగా.. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కదా బావగారు అని చెబుతాడు. అవునా..? ఎప్పుడు మారిపోయాడు వీడు అనే జోక్ వేస్తే.. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లో ఉన్న ధోనీ రేపే మాపో రిటైర్మెంట్ అవుతాడనుకున్న తరుణంలో ఇదేందిరా మామ ధోనీ ముంబై ఇండియన్స్ లోకి వెళ్లడం ఏంటి..? అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు. దీనిపై ట్రోలింగ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది సినిమాలో కామెడీ చేయడానికి ఈ సీన్ పెట్టాడా..? లేక నిజంగానే ధోనీ మారుతున్నారని ఎవ్వరికీ తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఎం.ఎస్. ధోనీ కెప్టెన్ గా వ్యవహరించారు. అంతకు ముందు ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 టైటిల్స్ ను ఎగురేసుకుపోయింది. కానీ రుతురాజ్ గైక్వాడ్ కి కెప్టెన్సీ అప్పగించిన తరువాత చెన్నై సూపర్ కింగ్స్ కాస్త వెనుకంజలో ఉండింది అనే చెప్పవచ్చు. కానీ గత సీజన్ లో ధోనీ కెప్టెన్సీలో కూడా అత్యంత వెనుకబడిపోవడం గమనార్హం. చివరి రెండు మ్యాచ్ లు మినహా మిగతా మ్యాచ్ ల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆశించిన మేర రాణించలేకపోయింది. ఈ తరుణంలోనే ధోనీ ముంబై ఇండియన్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లోకి ఎప్పుడ పోయిండని సినిమా డైలాగ్ రావడం ఇప్పుడు వైరల్ గా మారింది.