Jofra Archer: ప్రపంచ దేశాలలో చాలా దేశాల ప్రజలు క్రికెట్ అంటే ఎంతగానో ఇష్టపడతారు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు దాదాపు 90% మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు.. ఓ భావోద్వేగ ప్రయాణమని అర్థం చేసుకోవచ్చు. ఇక క్రికెటర్స్ ని ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతటి ఆదరణ, గుర్తింపు సంపాదించుకున్న క్రికెటర్లు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది క్రికెటర్లు ఒక దేశంలో పుట్టి.. మరొక దేశం తరఫున ఆడుతున్నారు. వీరిలో ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ ఒకరు.
Also Read: Smriti Mandhana wedding: పలాష్ ముచ్చల్ ఎపిసోడ్ లో ట్విస్ట్.. రంగంలోకి స్మృతి మందాన మాజీ ప్రియుడు ?
వెస్టిండీస్ లో పుట్టిన ఆర్చర్ ఇంగ్లాండ్ తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. ఇతడు బ్రిడ్జ్ టౌన్ బార్బడోస్ లో జన్మించాడు. జోఫ్రా ఆర్చర్ 1995 ఏప్రిల్ 1 న బార్బడోస్ లో జన్మించాడు. ఇతడి జీవన ప్రయాణం, విజయాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. జోఫ్రా ఆర్చర్ తండ్రి ఫ్రాంక్ ఆర్చర్, తల్లి జోయల్ వైథె. ఆర్చర్ తన తండ్రి ద్వారా బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు బ్రిడ్జ్ టౌన్ లోని క్రైస్ట్ చర్చ్ ఫౌండేషన్ స్కూల్ లో చదివాడు. అయితే ఆర్చర్ కి చిన్నప్పటినుండే క్రికెట్ పై మక్కువ ఎక్కువ. దీంతో మొదట్లో వెస్టిండీస్ అండర్ – 19 జట్టు తరఫున ఆడాడు. ఆ తరువాత 2015 లో ఇంగ్లాండ్ కి వెళ్ళాడు.
అయితే ఇంగ్లాండ్ వెల్స్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం అతడు తన 18వ పుట్టినరోజు తర్వాత వరకు ఇంగ్లాండ్ లో నివసించని కారణంగా.. ఇంగ్లాండ్ తరపున క్రికెట్ ఆడేందుకు ఏడు సంవత్సరాల నివాస కాలాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వెస్టిండీస్ అండర్ – 19 తరఫున మూడుసార్లు ఆడాడు. ఇక తన నివాసకాలం పూర్తయిన తర్వాత ఇంగ్లాండ్ తరపున 2016లో ససెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ తో అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ ని ప్రారంభించాడు. ఆ సమయంలో అతడి ఆసాధారణ వేగం, బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సామర్థ్యం సీనియర్ క్రికెటర్ల దృష్టిని ఆకర్షించింది.
అలా కొనసాగుతున్న తన కెరీర్ లో 2019 అత్యంత కీలకమైన సంవత్సరంగా మారింది. ఈ సంవత్సరంలోనే ఇంగ్లాండ్ జుట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన ఆర్చర్.. 2019 సంవత్సరంలో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ లో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న సూపర్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ కి ప్రపంచకప్ అందించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆ తర్వాత యాసెస్ సిరీస్ లో తన మెరుపు బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టి.. తన అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ని పొందాడు. అంతేకాకుండా 2019లోనే విస్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు.
క్రికెట్ ప్రపంచంలో శిఖరాగ్రానికి చేరుకుంటున్న సమయంలో ఆర్చర్ కి గాయాలు ఓ పెద్ద అడ్డంకిగా మారాయి. మొదట మోచేతి సమస్య, ఆ తరువాత వెన్నునొప్పి ఒత్తిడి, ఫ్రాక్చర్ కారణంగా అతడు చాలా కాలం పాటు మైదానానికి దూరంగా ఉన్నాడు. 2021 ఫిబ్రవరిలో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆర్చర్.. దాదాపు 1500 రోజులకు పైగా టెస్ట్ క్రికెట్ కి దూరమయ్యాడు. ఇక 2023లో అంతర్జాతీయ క్రికెట్ కి తిరిగి వచ్చాడు. కానీ అదే మోచేతి గాయంగా మరోసారి వెనుతిరగాల్సి వచ్చింది. అయినా ఆగకుండా కఠోరంగా శ్రమించి ఇటీవలే భారత్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా నాలుగు సంవత్సరాల విరామం తర్వాత జట్టులో చోటు దక్కించుకొని విమర్శకుల నోళ్లు మూయించాడు. అటు ఐపిఎల్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు.
Also Read: Ms Dhoni: గంభీర్ ను ఏకాకి చేసిన ధోని… ఇది కదా అసలు రివేంజ్.. ఈ వీడియో చూస్తే!
అలాంటి ఆర్చర్ లాంటి ఆటగాళ్ల కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏకంగా ఓ రూల్ ని మార్చిందంటే.. ఇతడు ఎంత గొప్ప ఆటగాడో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఓ సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ జట్టు తరుపున క్రికెట్ ఆడాలంటే.. ఇంగ్లాండ్ లో కనీసం ఏడు సంవత్సరాల నివాస కాలాన్ని పూర్తి చేయాల్సి ఉండేది. కానీ ఈ నిబంధనను ఇప్పుడు మూడు సంవత్సరాలకే కుదించింది. ఎందుకంటే 2019లో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన ఆర్చర్.. ఆ జట్టు టైటిల్ గెలుచుకునేందుకు ఎంత దోహదపడ్డాడో.. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా ఇతడి కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఓ గొప్ప స్ఫూర్తిదాయకమైంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">